రేపు పోలింగ్ ముగిసిన కొని క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అన్ని మీడియా సంస్థలు ప్రకటిస్తాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నూటికి నూరుశాతం నిజం కాలేదు. అలా అని వమ్ము కూడా కాలేదు. రాష్ట్రాల ఎన్నికల విషయంలోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల విషయంలోనూ ఇదే తీరు కనిపించక మానదు. 2004 నుంచి 2014 వరకు జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. గెలుపు అవకాశాలపై ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాల్నే ఇచ్చింది తప్పించి.. పక్కా ఫలితాన్ని చెప్పిన వైనం కనిపించదు.


2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయటంలో అన్ని మీడియా సంస్థలు ఫెయిల్ అయ్యాయి. బీజేపీకి 251-279 సీట్లు వస్తాయని ఇండియా టుడే.. సిసిరో.. 289 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య అంచనాలు వేశాయి. ఈ రెండు మీడియా సంస్థలు వాస్తవ ఫలితానికి కాస్త దగ్గరగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 325 సీట్లను సొంతం చేసుకుంది.ఈ ఎన్నికల వేళ సీఓటర్ 161 సీట్లు.. ఏబీపీ-సీఎస్ డీ ఎస్ చెప్పిన 170 సీట్లు.. న్యూస్ ఎక్స్-ఎంఆర్ సీ చెప్పిన 185 సీట్ల లెక్కలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.


అదే సమయంలో 2015లో జరిగిన బిహార్ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో లల్లూ ప్రసాద్.. నితీశ్ కుమార్ కూటమికి అంచనాలకు మించిన 178 సీట్లు రాగా.. బీజేపీ కేవలం 58 స్థానాల్నే సొంతం చేసుకోగలిగింది. ఈ ఎన్నికల్లో అన్ని మీడియా సంస్థలు బీజేపీకి అనుకూలంగా తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ దారుణంగా దెబ్బ తిన్న మరో ఎన్నికల ఫలితంగా 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రస్తావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: