తెలంగాణ ఎన్నికల్లో బాబు వేలు పెట్టడం అది కేసీఆర్ కు నచ్చకపోవటం తరువాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం మనం చూసాము.  కేసీఆర్ నోటి నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాట ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే.ఆయన మాటలకు తగ్గట్లే.. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా.. దాని కారణంగా నష్టం కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్త పడ్డారు కేసీఆర్.


ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ముందు పోలవరం మీద.. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ కు లాభంగా మారాయని చెప్పాలి.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలంటే జగన్ అధికారంలోకి రావాలన్న భావన ఏపీ ప్రజల్లో వచ్చిన పరిస్థితి. దీనికి తోడు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బైబై బాబు అన్న మాటను ఏపీ ప్రజలు చెప్పేసినట్లుగా చెప్పాలి.


బాబు ఓటమిలో జగన్ పాత్రను తక్కువ చేయలేం. అదే సమయంలో కేసీఆర్ ను మర్చిపోలేం. మొత్తంగా కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ బాబుకు ఎగ్జిట్ పోల్స్ తో అందినట్లేనన్న మాట వినిపిస్తోంది. బాబుకు కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్.. జగన్ చేతికి అధికారం అన్న మాటను కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: