Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:27 pm IST

Menu &Sections

Search

ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగరవేస్తాం... చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగరవేస్తాం... చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగరవేస్తాం... చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆదివారం సాయంత్రం నాటికి చివరి దశ ఎన్నికలు ముగియటంతో ఎన్నికల కోడ్ కు టైం ముగిసిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ప్రజల నాటి తామ సర్వేల ద్వారా వెల్లడిస్తున్నామంటూ ముందుకు వచ్చాయి. ఈ నేపద్యంలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ చక్రం తిప్పుతుందని మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం చంద్రబాబు అమరావతి వేదికగా మీడియా సమేవశం ఏర్పాటు చేశారు. తప్పకుండా ఏపీలో పసుపు జెండా ఎగరవేస్తామన్నారు.తెదేపా 35 ఏళ్లుగా సర్వేలు చేస్తోందని.. నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.


గెలుపుపై అనుమానం అక్కర్లేదు..

‘తెదేపా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అభివృద్ధి, సంక్షేమం వల్లే తెదేపా విజయం సాధిస్తుంది. నేను ఒక్క పిలుపు ఇస్తే అందరూ వచ్చి అర్ధరాత్రి దాటే వరకూ ఓటు వేశారు. అనేక ఇబ్బందులు పడి తెలంగాణ నుంచి వచ్చి ఓటు వేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే వీవీప్యాట్‌ స్లిప్పులపై నా డిమాండ్‌ను అందరూ ఒప్పుకొంటున్నారు. మాజీ సీఈసీ ఖురేషి కూడా నా అభిప్రాయాలను సమర్థించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. వీవీప్యాట్‌ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి?. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని ఖురేషి చెప్పారు. పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాలి.’


వెయ్యిశాతం టీడీపీదే గెలుపు!
ఏపీలో నూటికి వెయ్యిశాతం గెలిచేది టీడీపీనేనని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. తాను ఒక్క పిలుపు ఇస్తే వరదలా వచ్చి ఓటేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందన్నారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదని.. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదన్నారు.
 

మోదీ మెడిటేషన్‌ చేస్తే ఈసీ పట్టించుకోలేదు!
"ఎన్నికల్లో పారదర్శకత ఉండాలి. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికి అభ్యంతరమేంటి?. అధికారంలో ఉన్నా కూడా ఈవీఎంలపై పోరాడుతున్నాను. 5 బూత్‌లను కౌంట్‌ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని చెప్పారు. వీవీప్యాట్‌ ప్రింటర్‌ను మేనేజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. వీవీప్యాట్‌ స్లిప్‌ను బ్యాలెట్‌ బాక్సులో వేసేలా చేయాలి. విశ్వసనీయత పెంచుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఈసీ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. మోదీ కేదార్‌నాథ్‌లో మెడిటేషన్‌ చేస్తే ఈసీ పట్టించుకోలేదు" అని బాబు స్పష్టం చేశారు.


తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలి..
‘వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటరు చేతికి ఇవ్వాలి. ఓటరు సంతృప్తి చెందాక పక్కనున్న బాక్స్‌లో వేయాలి. ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పుల బాధ్యతలను వేర్వేరు అధికారులు చూస్తున్నారు. 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలి. కౌంటింగ్‌ ప్రక్రియలో ఇంకా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఈసీ పరిష్కరించాలి. ఈవీఎంలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామింగ్‌ చిప్‌ నియంత్రణ ద్వారా ఏదైనా చేయొచ్చు.’


అందరం చర్చించిన తర్వాతనే..
‘ఎన్నికలు ఇలా జరుగుతాయని నేను ఊహించలేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మాట్లాడి ఆ తర్వాత దిల్లీ వెళ్తాను. అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’ అని చంద్రబాబు అన్నారు.


ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ... ఇండియా భవనంలో మకాం
మరోసారి భేటీ అవనున్న ఇరు రాష్ర్టాల సీఎంలు
ఒంగోలు అత్యాచార ఘటనపై జగన్ ఆరా..
ముంబాయిలో ఎంజాయ్ చేస్తున్న శృతి, రానా, మరోకరు
సెక్సీ టీ షర్ట్ తో శాన్వి
చంద్రబాబు నివాసం హైదరాబాద్ లేక అమరావతా...?
సైరాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన తమన్న
ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తున్న సాహో బృంధం
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
స్మోకింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందించిన హిరో రామ్
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
 ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది...
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీరియసైన సీఎం జగన్
పోలీసు శాఖలో భారీగా నియమకాలు: సుచరిత
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.