తెలుగుదేశం పార్టీ నేత‌ల మాయాజాలంలో ఇదో పీక్స్ ప్ర‌చారం. ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేసిన‌ట్లు మీడియా, రాజ‌కీయ విశ్లేష‌కులు తొలి నుంచే అంచ‌నా వేశారు. తాజాగా విడుద‌లైన ఎగ్జిట్‌పోల్స్‌లోనూ వైసీపీదే అధికార‌మ‌ని ప్ర‌క‌టించాయి. అయితే, ఈ వాస్త‌వాల‌ను ప‌క్క‌న‌పెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్ర‌మైన ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తెచ్చింది. అమెరికాకు చెందిన నిఘా సంస్థ‌కు చెందిన అయిన సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స‌ర్వేలో టీడీపీదే అధికార‌మ‌ని తేల్చింద‌ట‌.


ప‌చ్చ పార్టీ త‌న ప్ర‌చారాన్ని న‌మ్మించేందుకు ప్రతిష్టాత్మ‌క సంస్థ‌ల‌ను వాడుకున్నాయి. సీఐఏ స‌ర్వే చేసింద‌ని పేర్కొంటూ దీన్ని ప్ర‌తిష్టాత్మ‌క బీబీసీ ప్ర‌సారం చేసింద‌ని ఇది వైర‌ల్ చేసింది. ఏపీలో ఇత‌ర పార్టీల‌కు ఒక్క సీటు కూడా గెల‌వ‌య‌ని....అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే మొత్తం సీట్లు గెలుచుకుంద‌ని తేల్చింది. కొద్దికాలం క్రితం వైర‌ల్ చేసిన ఈ స‌ర్వేను తాజాగా మ‌ళ్లీ ప‌చ్చ పార్టీ నేత‌లు వైర‌ల్ చేశారు. అయితే, ఈ స‌ర్వేలో వాస్త‌వం లేద‌ని నిపుణులు తేల్చుతున్నారు. అధికారం ద‌క్క‌ద‌ని ఖ‌రారైన నేప‌థ్యంలో ఈ మేర‌కు వైర‌ల్ చేస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: