ఇప్పటివరకూ వచ్చిన  ఎగ్టిట్ పోల్స్ సర్వేలు  అన్నీ కేంద్రంలో మోడీ మళ్ళీ  అధికారంలోకి వస్తాయని గట్టిగా  చెప్పాయి. అంతే కాదు దాదాపుగా ఒకే గొంతుతో పూర్తి మెజారిటీ కట్టబెట్టాయి. అలా ఇలా కాదు మూడు వందలకు పైగా సీట్లు ఇచ్చిన సర్వేలు ఉన్నాయి. ఓ  సర్వే అయితే ఏకంగా 366 సీట్లు ఇచ్చేసింది. అంటే ఇది 2014 నాటి 336కి 30 సీట్లు అదనం అన్నమాట.


మళ్ళీ మోడీ వస్తే తనకు చాలా ఇబ్బంది అని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఏడాదిగా ఆయన మీద యుద్ధం చేస్తున్న చంద్రబాబు రేపు ఏపీలో కాలం కలిసొచ్చి అధికారంలోకి వచ్చిన సుఖంగా ఉండలేరు. ఒక వేళ ఖర్మ కాలి ప్రతిపక్షంలోకి వస్తే ఇక ప్రతీ రోజూ యుధ్ధమే చేయాల్సిఉంటుంది. మోడీ ని సవాల్ చేసిన బాబు విషయంలో రెండోసారి ప్రధాని అయిన తరువాత ఉపేక్షిస్తారని అనుకుంటే పొరపాటే. ఇది బాబు బాధ, భయం అన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఇక జగన్ విషయం తీసుకుంటే కేంద్రంలో మోడీ మళ్ళీ రావాలని ఆశ ఉంది. అయితే మోడీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. అదే టైంలో తనకు ఎక్కువ ఎంపీలు రావాలి. తన మద్దతుతో కేంద్రంలో మోడీ సర్కార్ రావాలి. అపుడే ప్రత్యేక హోదా అయినా ఏపీకి నిధులు ఇతర అవసరాలు అయినా సాధించుకోగలమని జగన్ భావిస్తున్నారు. ఎవరి అవసరం లేకుండా మోడీకి పూర్తి మెజారిటీ వస్తే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేని నిస్సాయతతో ఉండాల్సిందే. ఈ భయం తో జగన్ ఉన్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: