ఎగ్జిట్ పోల్స్ లో జనసేన ప్రభావం ఉండదని చెప్పడం అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే సీరియస్‌గా పాలిటిక్స్ చేస్తూ గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున ప్రచారం హోరెత్తించారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత... ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారనే నమ్మకం అందరిలో కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందరికీ షాకిచ్చాయి. 


ఆదివారం విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో యావరేజ్‌గా1 నుంచి 4 సీట్లకు మించి రావని తేల్చేశాయి. ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడని భావించిన వారంతా ఈ నెంబర్స్ చూసి షాకయ్యారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని, వీటిని నమ్మ వద్దని అభిమానులు అంటున్నారు. మే 23న విడుదలయ్యే ఫలితాల్లో జనసేన పార్టీకి మంచి ఆధిక్యం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.  ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగానే.... పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


ఎన్నికల్లో జనసేన దారుణంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారంటూ ఆయన వ్యతిరేకులు కొందరు రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి కొందరు చేసిన నెగెటివ్ ప్రచారం తీవ్ర నష్టం కలిగింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాల్లోకి వెళతారంటూ కొందరు నెగెటివ్ ప్రచారం చేయడం ద్వారా జనసేన పార్టీపై వ్యతిరేకత పెంచారు. సినిమాల్లోకి తిరిగి వెళ్లే ఆలోచన లేదని, తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన జనసేన రివ్యూ మీటింగులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా నిరాశ చెందవద్దని, 25 ఏళ్ల పాటు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ప్రస్తుత వ్యవస్థలో మార్పు తేవడమే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతుందని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: