వీవీ ప్యాట్ల‌పై మ‌రో కీల‌క తీర్పు వెలువ‌డింది. ప్రతి నియోజకవర్గంలోనూ వందశాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.  50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ 21 విపక్ష పార్టీలో గతంలో వేసిన పిటిషన్‌ను ఇప్పటికే కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రతీ నియోజకవర్గానికి ర్యాండమ్‌గా ఐదు వీవీ ప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.  ఇలాంటి పిటిషన్లను మళ్లీ మళ్లీ ప్రోత్సహించలేమని వెకేషన్ బెంచ్ తేల్చి చెప్పింది.


కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది సాంకేతిక నిపుణులు... 50 శాతం వీవా ప్యాట్లు కాదు.. 100 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న పిటిషన్‌ను కొట్టివేసినట్టుగానే... 100 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని దాఖలైన పిటిషన్లను కూడా కొట్టివేసింది.  పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: