ఇప్పటికే పలు జాతీయ సర్వేలు , ఎగ్జిట్ ఫలితాలు వైసీపీదే విజయమని చెప్పాయి. ఇపుడు అదే బాటలో ది హిందూ- సీఎస్డీఎస్-లోక్ నీతి సర్వే ప్రకారం కేంద్రలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఎన్డీఏకు 40-42శాతం వరకు ఓట్ షేరింగ్ జరిగిందని ఈసర్వే తేల్చింది. ఇక యూపీఏకు 28-30శాతం వరకే ఓట్ షేరింగ్ జరిగిందని అంచనావేసింది. ఇతరులకు 18-20శాతం వరకూ ఓట్ షేరింగ్ ఉందని అంచనావేసింది.ఇక ఏపీకి సంబంధించి కూడా దిహిందూ ఫలితాలను వెల్లడించింది.


అత్యధికంగా ఏపీలో వైసీపీకి 43శాతం ఓట్ షేరింగ్ జరిగిందని.. టీడీపీకి 38శాతం ఓట్ షేరింగ్ ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య దాదాపు 5శాతం ఓట్ల తేడా ఉండడంతో వైసీపీకి మెజార్టీ స్థానాలు దక్కుతాయని తెలుస్తోంది. ఎందుకంటే 2014లో ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.95శాతమే.. కానీ టీడీపీకి 102 సీట్లు - వైసీపీకి 67సీట్లు మాత్రమే వచ్చాయి.


దీంతో ఐదు శాతం ఎడ్జ్ ఉన్న వైసీపీ ఏపీలో అత్యధిక ఎమ్మెల్యే - ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమంటున్నారు.ది హిందూ- సీఎస్డీఎస్-లోక్ నీతి సర్వే ప్రకారం ఏపీలో 43శాతం ఓటింగ్ తో వైసీపీకి దాదాపుగా 18-22 లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. టీడీపీకి 3-6 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.అయితే జాతీయ చానెళ్లు  - సర్వేల్లో మెజార్టీ వైసీపీ గెలుస్తుందనడం.. ఇప్పుడు హిందూ కూడా వైసీపీకే మొగ్గుచూపడంతో ఆ పార్టీలో జోష్ వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: