వైసిపిలోని అగ్ర నేతలందరూ తాడేపల్లికి చేరుకుంటున్నారు. గురువారం నాడు వెల్లడవనున్న ఫలితాల కారణంగా అగ్ర నేతలందరినీ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జగన్ కూడా బుధవారం సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటున్నారు.

 

పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చునే జగన్ తో పాటు అగ్రనేతలందరూ ఫలితాల సరళిని గమనిస్తారు.  అధికారంలోకి రాబోయేది వైసిపినే అని ఎగ్జిట్ పోల్ సర్వేలతో నేతలందరిలోను ఉత్కంఠ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ కాస్త తారుమారై హంగ్ వచ్చే అవకాశం ఉన్నా క్యాంపు రాజకీయాలకు వైసిపి రెడీగా ఉందని అర్ధమైపోతోంది.

 

ఎంఎల్ఏ, ఎంపి స్ధానాలకు పోటీ చేసిన అభ్యర్ధులందరినీ తాడేపల్లికి రావాలని జగన్ ఆదేశించటంతోనే విషయం అర్ధమవుతోంది. ఒకవైపు వైసిపికి బంపర్ మెజారిటీ రావటం ఖాయమని ఎగ్జిట్ ఫలితాల్లో తేలినా ముందు జాగ్రత్తగా జగన్ ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే, చంద్రబాబునాయుడు మీద ఏమాత్రం నమ్మకం లేని జగన్ ఇటువంటి చర్యలు తీసుకోవటంలో వింత కూడా ఏమీ లేదు. ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే గెలిచిన అభ్యర్ధులు తమ నియోజకవర్గాలకు వెళ్ళాలని జగన్ చెప్పారట.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: