సోమాజీగూడ ప్లెస్ క్ల‌బ్‌లో ఫైటింగ్ జ‌రిగింది. ఎస్సీ, ఎస్టీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత శ్రీశైలం పై దాడి జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్రెస్‌క్ల‌బ్‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే స్వేరోస్ మెంబ‌ర్లు దాడికి పాల్ప‌డ్డారు. పిడిగుద్దులు గుద్దారు. ఐసీఎస్‌ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయ‌న మాట్లాడుతున్న టైమ్‌లో ఆగ్ర‌హంతో దాడి చేశారు. 


ఈ ఘ‌ట‌న‌తో ప్రెస్‌క్ల‌బ్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. మ‌రోవైపు న్యూస్ క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చిన మీడియా ప్ర‌తినిధుల‌పై కూడా స్వేరోస్ స‌భ్యులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఘ‌ట‌న‌పై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. 


మ‌రోవైపు దళిత నేత  శ్రీశైలంపై స్వేరోస్‌ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్‌ అండదండలతో స్వేరోలు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆరోపించారు.


కాంట్రాక్టు ఉద్యోగులపేరుతో గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్‌, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇక త‌మ బండారం, బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తార‌న్న భ‌యంతోనే శ్రీశైలంపై దాడికి తెగ‌బ‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: