ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ మొదలైన కొద్దిసేపటికే చాలా చోట్ల ఎన్డీయే లీడింగ్ లో ఉన్నది.  ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్ కు అనుగుణంగా కౌంటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది.  ఇప్పటికే పలు చోట్ల లీడింగ్ లో ఉండటం విశేషం. ఈరోజు వచ్చే ఫలితాలు బీజేపీ అనుకూలంగా ఉండి బీజేపీ విజయం సాధించి మోడీ తిరిగి అధికారంలోకి వస్తే.. మోడీ మరో రికార్డును సాధించినట్టు అవుతుంది.  


ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒకసారి ప్రధానిగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.  ఈసారి మోడీ విజయం సాధిస్తే రికార్డు సాధించినట్టే అవుతుంది.  అదెలా అంటే ఓకే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినా వ్యక్తి వరసగా రెండు సార్లు ప్రధానిగా ఎన్నిక కావడం రికార్డే అని చెప్పాలి.  నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగం, రైతు సమస్యల వంటి వాటిపై ప్రతిపక్షం టార్గెట్ చేసి బీజేపీపై విమర్శలు చేసింది


ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జాతీయ వాదం, భద్రతా, కేంద్రంలో బలమైన ప్రభుత్వం వంటి విషయాలను టార్గెట్ చేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళింది.  వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ సఫలం అయిందా లేదా అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: