175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 150 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందుంజలో ఉండి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతున్న త‌రుణంలో...రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. వైసీపీ దూకుడుతో  శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఇంగ్లీష్‌లో ముద్రించిన నేమ్‌ బోర్డును జగన్ నివాసానికి తీసుకువచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందు ఈ నేమ్ బోర్డును చూపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం, ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి రంగం సిద్ధ‌మైంది. అయితే, ఈ ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజీనామా చేశారు.

ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని... తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని  వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గురువారం సాయంత్రం గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని నారా చంద్రబాబు నాయుడు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: