కుప్పం అంటేనే చంద్రబాబుకు కంచుకోట లాంటి సీటు, ఇప్పటికి ఆరు సార్లు ఆయన అక్కడ గెలిచారు. గత సారి దాదాపుగా యాభై వేల ఓట్ల తేడాతో గెలిచిన బాబు ఇపుడు మాత్రం కేవలం 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించడం దారుణమే.


అది కూడా ఒకటి రెండు రౌండ్లలో  వెనకబడి మరీ బాబు చివరికి ఇలా గెలిచారంటే అది ఓ విధంగా ఓటమే. బాబును కుప్పం నెత్తి మీద పెట్టుకుంది. సొంత వూరు చంద్రగిరిని దాటి వచ్చిన బాబుని అక్కున చేర్చుకుని ఆదరించింది.


అటువంటి కుప్పంలో బాబు మెజారిటీ ఒకపుడు 60 వేలకు పై దాటింది. గతసారి మెజారిటీ తగ్గినా ఈసారి అందులో సగానికి  పడిపోవడం ఓ విధంగా బాబు పార్టీ పట్ల వ్యతిరేకత ఎలా ఉందో చెబుతోంది. పైగా ఎమ్మెల్యేగా బాబు కు చాలా తక్కువ మార్కులు జనం వేశారన్నది ఈ ఫలితం తేల్చిచెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: