సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా తుఫాన్‌లా దూసుకెళ్తున్న బీజేపీకి ఆ రాష్ట్రంలో బేకులు ప‌డ్డాయి. దేశ వ్యాప్తంగా సునామీ సృష్టించిన బీజేపీ త‌మిళ‌నాడులో ఒక్క ఖాతా కూడా ఓపెన్ చేయ‌లేక‌పోయింది. మోదీ దూకుడు త‌మిళనాడులో ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.


ఇక‌ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే మాత్రం ఇర‌గ‌దీసింది. స్టాలిన్ దెబ్బ‌కు బీజేపీ కొట్టుకుపోయింది. బీజేపీ మాయా జాలం అక్క‌డి ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. 


కాంగ్రెస్, విదుతలై చిరుథైగల్ కచ్చి (వీసీకే), సీపీఐ, సీపీఎంలతో కూడిన కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోయింది.ఇక మ‌రోవైపు ఆ పార్టీలో స‌మ‌న్వ‌య లేమితో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకే అస‌లు సోదీలోనే లేకుండా పోయింది. అన్నాడీఎంకే థేని, చిదంబరం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 


ఈ రెండు స్థానాల నుంచి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, పి. చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి బ‌రిలో దిగిన ఐదుగురు అభ్యర్థులు 20 వేలకు పైగా ఓట్ల తేడాతో వెనకబ‌డ్డారు. కన్యాకుమారిలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ రాధాకృష్ణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వసంతకుమార్‌ కంటే 40 వేలకు పైగా ఓట్లతో వెన‌కంజ‌లో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: