గాజువాక పెద్ద నియోజకవర్గం. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. పైగా బలమైన కాపు సామాజికవర్గం ఉంది. ఈ సమీకరణలే జనసేనానికి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఉసిగొల్పాయి. మార్చ్ 21న నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమనుకున్నారు. అయితే పవన్ సరిగ్గా ప్రచారం చేయకపోవడం, భీమవరంలో రెండో సీటు పోటీ చేయడం, సెలిబ్రిటీ కావడం వల్ల అందుబాటులో ఉండరన్న విమర్శల  మధ్య ఆయనకు గాజువాక ఓటర్లు ఝలక్ ఇచ్చారు.


పవన్ తో పోటీ పడిన వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి దాదాపుగా 17 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. ఆయన లోకల్ హీరో అని స్వయంగా జగన్ చెప్పారు. పైగా జగన్ వేవ్ బాగా ఉంది. ఇక మరో అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ కూడా లోకల్, బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వాడు. దాంతో పవన్ తొలి ప్లేస్ నుంచి మూడవ స్థాననికి జారిపోయాడు. ఇది నిజంగా జనసెన అభిమానులకు షాకింగ్ పరిణామమే.


మొదటి నుంచి పవన్ గెలుపు పై డౌట్లు ఉన్నా తక్కువలో తక్కువగా బయటపడతారని అనుకున్నారు. కనీసం రన్నర్ గా ఉంటారని చివర్లో భావించారు. అదీ ఇదీ కాకుండా మూడవ స్థానానికి చేరారంటే ఎంత సినిమా స్టార్ అయినా, బలమైన కులం ఉన్నా ప్రజలను మెప్పించి ఒప్పించే వాడే నాయకుడు అన్న నీతిని గాజువాక ప్రజలు నిరూపించారు. కులానికి, సినీ వ్యామోహానికి అందని అరుదైన తీర్పు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: