గంటా శ్రీనివాసరావుని ఓటమెరుగని వీరుడంటారు.  రాజకీయ అజేయుడంటారు. కానీ ఆయన తొలిసారి గెలిచి ఓడారు. విశాఖ నార్త్ నుంచి అతి తక్కువ మెజారిటీతో బయటపడిన గంటాకు కొత్త అభ్యర్ధి వైసీపీ నేత కేకే రాజు చుక్కలు చూపించారు. చివరి రౌండ్ల వరకూ గంటాతో  గెలుపు దోబూచులాడింది. దాంతో మంత్రి అనుచరులు తెగ టెన్షన్ పడ్డారు. నిజంగా గంటా రాజకీయ జీవితంలో ఇలా ఎపుడూ జరగలేదు.


కేకే రాజు అనే రాజకీయాలకు కొత్త వ్యక్తి మంత్రికి చమటలు పట్టించారు. ఓ దశలో గంటా ఓటమి ఖాయమన్న మాట కూడా వచ్చింది. పలు రౌండ్లలో గంటా వెనకబడిపోయారు కూడా విశాఖ నార్త్ ఓటర్లు గంటాపై వచ్చిన అవినీతి ఆరోపణలను పట్టించుకున్నట్లుగా కనిపించింది. ఆ ప్రభావం ఆయన గెలుపు పై తీవ్ర ప్రభావం చూపించింది.


ఇక గంటా ఇప్పటివరకూ పాతిక వేలకు తగ్గకుండా భారీ  మెజారిటీలతో గెలిచారు. భీమిలి నుంచి 2014 ఎన్నికల్లో 38 వేల మెజారిటీతో గెలిచిన గంటా ఇపుడు మూడు వేలకు పడిపోవడం రాజకీయ పతనమేనని అంటున్నారు. ఇక గంటా గెలిచినా ఆయన చరిష్మా బాగా  తగ్గిపోయింది. పార్టీ ఓడిపోయింది. దాంతో ఆయన ఓ మామూలు సాధారణ ఎమ్మెల్యేగా మిగలడం మరో షాకింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: