నరేంద్రమోడి సొంత రాష్ట్రంలో బిజెపి తన పట్టును నిలుపుకుంది. తాజా ఫలితాల్లో 26 పార్లమెంటు సీట్లకు 26 గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది.  26 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో బిజెపి-కాంగ్రెస్ మధ్య పోటి జరిగినా ఆధిక్యత మాత్రం కమలానిదే అని రుజువైపోయింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు బిజెపి అభ్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.

 

రెండేళ్ళ క్రితం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 81 సీట్లు గెలిచింది. దాంతో పార్లమెంటు ఎన్నికల్లో కసీనం సగం సీట్లన్నా గెలవకపోతామా అని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. అయితే రెండు చోట్ల అధికారంలో ఉండటం బిజెపికి బాగా కలిసివచ్చింది. దానికితోడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధి నగర్ నియోజకవర్గంలో పోటీ చేయటంతో స్ధానిక నేతలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశారు.

 

సౌరాష్ట్ర ప్రాంతంలోని వ్యవసాయ సమస్యలు బిజెపిని ఇబ్బంది పెడతాయని భావించినా దాని ప్రభావం  పెద్దగా కనిపించలేదు. అలాగే వ్యాపారులను బాగా ఇబ్బంది పెడుతున్న జీఎస్టీ అంశం కూడా పెద్దదే. ఆశ్చర్యంగా ఆ సమస్య కూడా బిజెపిపై కనబడలేదు. పటిదార్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్ పోటీ చేయలేకపోయారు. కోర్టు జోక్యం కారణంగా హార్దిక్ ఎక్కడా పోటీ చేయలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ లో గట్టి నేతగా ఉన్న అల్పేష్ ఠాకూర్ కూడా పార్టీని వదిలేయటంతో చాలా చోట్ల దాని ప్రభావం కనబడింది. మొత్తానికి ఏదేమైనా మోడి, బిజెపి మాత్రం గుజరాత్ లో తన పట్టుని నిలుపుకున్నారనే చెప్పాలి.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: