దేశమంతా నరేంద్రమోడి హవా కనిపించినా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది.  రాష్ట్రంలోని 13 లోక్ సభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 8 సీట్లలో గెలవటమే ఇందుకు నిదర్శనం. రెండేళ్ళ క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాలు ఇంకా భ్రమలు కోల్పోలేదు. అందుకనే మెజారిటీ సీట్లు కట్టబెట్టారు.

  

సిఎంగా బాగా అనుభవం ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉండటం కూడా కాంగ్రెస్ కూడా కలిసివచ్చింది.  అదే సమయంలో బిజెపి-అకాలీదళ్ కూటమిగా పోటీ చేసినా కాంగ్రెస్ ఆధిక్యతను తగ్గించలేకపోయింది. 2017కు ముందు రాష్ట్రాన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు పాలించిన కూటమి అంటే జనాలు విసిగిపోయారు. దాని ప్రభావం ఇంకా కూటమిపై పోలేదు. అందుకనే కాంగ్రెస్ ను ఆధరించారు  జనాలు.

 

పోయిన ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు స్ధానాలను గెలుకుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఎన్నికల్లో ఒక్క సీటుతొనే సరిపెట్టుకోవల్సొచ్చింది. అందుకనే బిజెపి కూటమికి నాలుగు సీట్లు దక్కాయి. పాకిస్ధాన్ కు సరిహద్దు రాష్ట్రం కాబట్టి మోడి జాతీయ వాదం పనిచేసి అధిక సీట్లు వస్తాయని బిజెపి అనుకున్నది. అయినా ఇక్కడ మోడి ట్రిక్ పనిచేయలేదని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: