వైఎస్ జగన్ పదేళ్ళ క్రితం తండ్రి చాటు బిడ్డ. గత దశాబ్దంగా మాత్రం ఆయన ప్రతి ఒక్కరికీ చిర పరిచితుడే. ఆయన ఏపీని అటు వైపు నుంచి ఇటు వైపు గా చుట్టెశారు. ఆయన పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన పోరాటాలు మరో చరిత్ర. ఇపుడు ఆయన విజయం అసలైన చరిత్ర.


అటువంటి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరి జగన్ ఎలా పాలిస్తారు అన్న విషయం తీసుకున్నపుడు ఆయన మీద అన్ని వర్గాల ప్రజల్లో చాలా అంచనాలు వున్నాయి. అవి ఆలా ఇలా కాదు, భారీ ఎత్తున ఉన్నాయి. జగన్ మేలు చేసే నాయకుడు, ప్రామిసింగ్ లీడర్, మాట తప్పడు, మడమ తిప్పడు, ఆయన మాట ఇస్తే అది శాసనమే. ఇలా సినీ రాజకీయ వర్గాల ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకం కూడా జగన్ గురించి అనుకుంటున్నారు.


ఇక్కడ జగన్ గురించి చెప్పుకోవాలి. ఆయన పదే పదే ప్రతీ మీటింగులో చెప్పారు. తనకు ఓ అవకాశం ఇస్తే గుర్తుండిపోయే పనులు చేస్తాను, చనిపోయిన తరువాత తన ఫోటో ప్రతీ ఇంట్లో ఉండాలని కోరుకుంటాను అని చెబుతూ వచ్చారు. ఇక జగన్ విధానాలు, ఆయన పార్టీ వారితో మెలిగిన తీరు, ఆయన నిక్కచ్చితనం, రాజీనామా చేసి వస్తేనే తప్ప తన పార్టీలోకి ఎవరినీ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా చూసిన జనం జగన్ అధికారంలోకి వస్తే కొత్త మార్ఫులు తెస్తాడని కోటి ఆశలు పెట్టుకున్నారు.


ఓ విధంగా చెప్పాలంటే గంపెడాశలు  జగన్ మీద ఉంచారు. ఇది ఓ విధంగా జగన్ మీద మోయలేని భారమే. అయినా జగన్ ప్రత్యేక హోదా తేస్తారని, పోలవరం పూర్తి చేస్తారని, అమరావతి కడతారని, పదమూడు జిల్లాలు దశ దిశా మార్చేస్తారని చాలా ఆశలు జనంలో ఉన్నాయి. మరి జగన్ వాటిని కచ్చితంగా నిలబెట్టుకుంటాడని కూడా అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: