పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారో అందరికీ తెలుసు అయాన రెండేళ్ళుగా సినిమాలు లేకుండా పొలిటికల్ లైఫ్ గడిపారు. అన్ని జిల్లాలు పర్యటన చేశారు. అయితే అనుకున్నట్లుగా బలమైన అభ్యర్ధులు చాలా చోట్ల ఆ పార్టీకి లేకపోవడం, సరైన వ్యూహాల లేమి, సంస్థాగత లోపాలు అన్నీ కలసి పవన్ని ఓడించేశాయి. 


ఇదిలా ఉండగా టీడీపీ ఈసారి ఘోరంగా ఓడిపోయింది. దాంతో అనుకూల మీడియా తక్కువ తప్పులు అధినాయకత్వం వైపు చూపించడానికి బాబు మీద విశ్వాసం పోకుండా చూడడానికి నానా తంటాలు పడుతోంది. ఈ నేపధ్యంలో వారికి పవన్ దొరికారు. పవన్ వల్లనే ఇంత దారుణంగా ఓడిపోయామని  ఆ పార్టీ నేతలు అంటున్నారుట. ఇదే విషయాన్ని అధినాయకుడు ద్రుష్టిలోకి కూడా తీసుకువెళ్ళారట.


ఇప్పటిదాకా ఈవీఎంల మీద నింద మోపి పోలింగ్, కౌంటింగ్ మధ్య కాలాన్ని గడిపేసిన అధినేత అసలు ఫలితాలు రావడంతో ఏం మాట్లాడలేకపోతున్నారు. దాంతో ఇపుడు అనుకూల మీడియా, కొంతమంది తమ్ముళ్ళు పవన్ని పాపాల భైరవున్ని చేస్తున్నాఉట. పవన్ కనుక పోటీలో లేకపోతే విజయం టీడీపీదేనని వారు అంటున్నారుట. దీని మీద ఓ నివేదిక తయారు చేసి అధినేతకు ఇచ్చే పనిలో పడ్డారుట.
ఇదేలా ఉందంటే సరిగ్గా పదేళ్ళ క్రితం 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి మధ్యలో వచ్చి మా అవకాశాలు పోగొట్టారని అప్పట్లో ప్రతీ రోజూ టీడీపీ అధినేత గోల పెట్టేవారు.


అలాగే ఆయన అనుకూల పత్రికలు కూడా ఇదే విషయాన్ని పెంచి పెద్దదిగా చూపించేది. మొత్తానికి చిరంజీవి ఈ బాధపడలేక తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి వెళ్ళిపోయాడు. ఇపుడు పవన్ కూడా పూర్తిగా సినిమాలు చేయాలి. రాజకీయ వూసు ఎత్తకూడదు, ఇదే కాబోలు తమ్ముళ్ల ప్లాన్. అదే విధంగా పార్టీ క్యాడర్ పవన్ మీద పడి ఏడవాలి తప్ప బాబు అసమర్ధత, ప్రభుత్వం అవినీతి అన్నది ఎక్కడా చెప్పరన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: