సీఎం కొడుకుగా ఉండి, చేతిలో అధికారం ఉన్న లోకేష్ ఘోర ఓటమిని చవిచూశారు. ఆల్రెడీ మంత్రిగా ఉన్నవాడు, పైగా సీఎం తనయుడు గెలుపు కోసం ఏం చేయాలో అన్నీ చేసి కూడా ఓడిపోవడం ఆశ్చర్యకరం. దేశంలో ఏ పెద్ద నాయకుడి వారసుడికీ ఎదురు కాని పరాభవం ఇది. కనీసం ఈ ఎన్నికల్లో లోకేష్ గెలిచి ఉంటే చంద్రబాబుకు అంతో ఇంతో స్వాంతన లభించేది. తనకు వయసు మీద పడుతున్న నేపథ్యంలో కొడుక్కి కొంత మేర బాధ్యతలు అప్పగించేవాడు.


కానీ ఇప్పుడా అవకాశం లేకపోయింది.అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆయనకు చాలా ఏళ్లు పట్టేసింది. ఎన్నికల్లో గెలిచి మంత్రిగా అయితే ఆ గౌరవం వేరుగా ఉండేది. పార్టీలో ఎందరో సీనియర్ నాయకుల్ని కాదని ఎన్నడూ ఎన్నికలు ఎదుర్కోని లోకేష్‌ను మంత్రిని చేయడమే చంద్రబాబు చేసిన తప్పు. దీంతో పాటుగా సీఎం కొడుకు కావడం వల్లే పార్టీలో లోకేష్‌కు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది.


ఇంత కీలకమైన నాయకుడు పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఘోర పరాభవం చవిచూశాడు. అధికారం ఉండి, ఎన్నో సానుకూలతలు ఉన్నపుడే లోకేష్ తనేంటో రుజువు చేసుకోలేకపోయాడు. పార్టీని నడిపిస్తాడన్న ఆశే కలిగించలేదు. ఇక పార్టీ దారుణాతి దారుణ పరాభవం ఎదుర్కొన్ని ప్రతిపక్షంలో కూర్చున్నాక, నాయకులంతా చేజారిపోయే పరిస్థితుల్లో, తండ్రి రిటైర్మెంట్ తీసుకుంటే పార్టీని ఎలా నడిపించగలడు అన్నది ప్రశ్నార్థకం.


మరింత సమాచారం తెలుసుకోండి: