Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 4:47 am IST

Menu &Sections

Search

ఒక్క‌డినే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తా...బాబు అవినీతి అంతా క‌క్కిస్తా...మోదీతో హోదా సాధిస్తా...ఢిల్లీలో జ‌గ‌న్

ఒక్క‌డినే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తా...బాబు అవినీతి అంతా క‌క్కిస్తా...మోదీతో హోదా సాధిస్తా...ఢిల్లీలో జ‌గ‌న్
ఒక్క‌డినే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తా...బాబు అవినీతి అంతా క‌క్కిస్తా...మోదీతో హోదా సాధిస్తా...ఢిల్లీలో జ‌గ‌న్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైసీపీ అధినేత‌, ఏపీ కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర‌ మోదీతో భేటీ అయిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 న ఒక్కడిగానే ప్రమాణ స్వీకారం చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. పది, పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఏపీ రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానితో చర్చించాన‌ని వెల్ల‌డించారు. కేంద్ర సాయం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటా అని జ‌గ‌న్ త‌న వైఖ‌రిని తేల్చిచెప్పారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ``విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టారు. విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలయ్యేలా చూస్తాం.  కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. రాష్ర్టాన్ని బాగా నడపాలనే తపన నాకు ఉంది. రాష్ర్టానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97వేల కోట్లు అప్పులు ఉంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.2లక్షల 57వేల కోట్లకు అప్పలు చేరాయి. మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తాను.`` అని స్ప‌ష్టం చేశారు.  


ఎన్డీఏ బలం 250 దాటకూడదని చాలాగా దేవుణ్ని ప్రార్థించాన‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏ 250 స్థానాలకే పరితమై ఉంటే బాగుండేద‌ని జ‌గ‌న్ అన్నారు. `` ఎన్డీఏకి పూర్తి బలం రాకుండి ఉంటే ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేది. ప్రత్యేక హోదా మన హక్కు, ఈ హక్కును ఇప్పుడు వదిలేస్తే ఎప్పటికి రాదు. ప్ర‌ధానిని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదాపై ప్రధాని ని కోరుతూనే ఉంటాను. ప్ర‌త్యేక హోదా అనే ఒక్క అంశంపైనే ప్ర‌ధాన‌మంత్రితో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆతృత ఉంది. పోలవరం నిర్మాణం కేంద్ర బాధ్యత, అంతకు ముందు, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం. పోలవరం నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తా
`` అని జ‌గ‌న్ పేర్కొన్నారు.


చంద్రబాబు చేసిన స్కాంలు అనేకమ‌ని, ఒక్కొక్కటిగా బాబు స్కాంలను వెలికి తీస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ``తెలంగాణ సీఎంకేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యాను. రెండు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహ బంధం బలపడింది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి, అందులో ముఖ్యమైన తెలుగు రాష్ట్రం తెలంగాణ తో స్నేహ బంధం అవసరం. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి తానే ఒక అడుగు ముందుకేసి మాకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను కలిసి సాధిద్దామని పెద్దాయన(సిఎం కేసీఆర్) ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటు లో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన స్పష్టం చేశారు. ఏపీలో 22, తెలంగాణ 9, మొత్తం 31మంది ఎంపీలం ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి ఇద్దరం సీఎం లం కలిసి పని చేస్తాం`` అని ప్ర‌క‌టించారు.


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
మ‌రో సంచ‌ల‌న స్కాం...బాబు అవినీతి బ‌ట్ట‌బ‌యలు..స‌న్నిహిత మంత్రితో..
ఢిల్లీలో ప్రత్యేక హోదా లక్ష్యంగా..విజయసాయికి మరో కీలక పదవి!
పీకేకు కొత్త క్ల‌యింట్ దొరికాడు...కానీ అస‌లు స‌మ‌స్య అదే
హ‌రీష్‌రావు బాధ‌లో ఉంటే...జ‌గ్గారెడ్డి కెలికి మ‌రీ ...
జ‌గ‌న్ షాకింగ్ కామెంట్లు... బీజేపీ వైపు నేత‌ల చూపు
రాహుల్‌గాంధీ వివాదాస్ప‌ద ఫోటో...మీ కంటే కుక్క‌లే స్మార్ట్ అన్న బీజేపీ నేత‌
కేసీఆర్ సంతోషం లెక్కేంటో చెప్పిన కేంద్ర‌మంత్రి
ఇరాన్‌పై సైనిక దాడి...డ్రోన్ కూల్చివేత‌...అమెరికా ర‌చ్చ‌
బీజేపీ వ‌ద్దు...బీజేపీనే ముద్దు....బాబోరు టీడీపీని తుడిచిపెట్టే వ‌ర‌కూ ఊరుకునేట్లుగా లేరుగా
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం...మెట్రో ఎక్కిన హీరో
44 డిగ్రీల ఎండ‌లో..ఇసుక‌లో... కాళేశ్వ‌రం క‌ష్టాలు వివ‌రించిన హ‌రీష్‌రావు
కొత్త ఇంట్లోకి రోజా....అమ‌రావ‌తిలో ఎందుకు సొంతిళ్లంటే...
బాబుకు బీపీ పెంచ‌డ‌మే బీజేపీ ప‌ని...కొత్త టార్గెట్‌తో బాబు తేరుకోవ‌డం క‌ష్టం
ఈ వాహ‌నాలు కొంటే...మీకు జీఎస్టీ భారం ప‌డ‌దు...
కాళేశ్వ‌రానికి సెల‌బ్రిటీలు ఫిదా...ట్వీట్ల‌తో ఉత్సాహం
తెలంగాణ నేల‌పై కాళేశ్వ‌రం జ‌లాలు..సంబురాల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు
హెచ్1బీ వీసాల్లో కోత‌....ఇండియ‌న్ల‌కు అమెరికా ఇక క‌లేనా?
లోకేష్‌పై తిరుగుబాటు...ఆ మీడియా పెద్దాయ‌న ఎంట్రీ...టీడీపీ నేత‌ల ప్ర‌త్యేక స‌మావేశం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.