ప్రధాన మంత్రిని కలిసిన అనంతరం మీడియా కు వెల్లడించిన అంశాలివి. 
–రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని ప్రధాని నరేంద్రమోదికి వివరించా.
–మన బాధలు చెప్పుకున్నాం.
–రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు.
–అది మన హక్కు.దానిని వదలకూడదు.
–రాష్ట్రానికి అన్నిరకాల సహాయం కావాలని కోరాను.
–కేంద్రం నుంచి తగిన సహాయం కోరాను.
–రాష్ట్రసమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారు.
–రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌ లో ఉన్న విషయాన్ని వివరించా.
–ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నా.
–రాష్ట్రానికి అందాల్సిన సహాయం ఆలస్యమైంది.
–రాబోయే రోజులలో ప్రధాని మోదిని మళ్లీ కలుస్తా.
–చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 2.57 లక్షలకోట్ల అప్పులు పెరిగాయి.
–రాష్ట్రం విడిపోయేనాటికి 97 వేల కోట్ల అప్పులున్నాయి.
–అప్పుల పై ఏటా 20 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోంది.
–పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి.
–తెలుగురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరం.
–అమిత్‌ షా ను కూడా మర్యాదపూర్వకంగానే కలిశా.
–ప్రత్యేకహోదా గురించి ప్రధానితో చర్చించా.
–ఇచ్చేంతవరకు ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉంటా
అది వచ్చి తీరుతుందని భావిస్తున్నా.
–కేసిఆర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశా.
–ప్రత్యేక హోదా కోసం కేసిఆర్‌ మధ్దతు ఇచ్చారు.
–ప్రత్యేక హోదా విషయంలో వెనకకు తగ్గేదిలేదు.
–మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తాం.
–రాష్ట్ర పరిస్దితులపై శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
–ప్రమాణస్వీకారం తర్వాత శాఖలవారీగా సమీక్షలు చేస్తా.
ఆ తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేస్తా.
–పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తా.
–మద్యంపై రెవిన్యూను గ్రాడ్యువల్‌ గా తగ్గిస్తాం.
–మద్యపానం నిషేధించాకే 2024లో మళ్లీ ఓట్లు అడుగుతా
–దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తాం.
–మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.
–ప్రజలలో చైతన్యం తీసుకువస్తాం.
–30 వతేదీన నేను ఒక్కడినే ప్రమాణస్వీకారం చేస్తాను.వారం పదిరోజులలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.
–విశ్వసనీయత అనే పదం పై నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేశారు. దానిపై నమ్మకం సన్నగిల్లకుండా అడుగుముందుకు వేస్తా.
–మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా,ఖురాన్‌ లా భావిస్తాను
––రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తా.
–నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సెక్రటేరియట్‌ లోనికి అడుగుపెట్టలేదు.
–మంత్రికి గాని అధికారులు ఎవరికి ఫోన్‌ చేయలేదు.
–ఆ సమయంలో నేను హైద్రాబాద్‌ లోనే లేను.నేను బెంగళూరులో ఉన్నాను.
–తల్లిదండ్రులను చూసేందుకు మాత్రమే హైద్రాబాద్‌ కు వచ్చేవాడ్ని.
–నాన్న బతికిఉన్నప్పుడు నాపై కేసులు లేవు.
–నాన్న చనిపోయాక కాంగ్రెస్‌ ను వ్యతిరేకించాక నాపై కేసులు టిడిపి ప్రోద్భలంతో వేయబడ్డాయి.
–పలానా చోట రాజధాని వస్తోందని చంద్రబాబుగారికి ముందే తెలుసు.
–ప్రకటనకు ముందు రాజధాని వేరచోట వస్తాఉందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో తన సన్నిహితులు తన బినామిలు భూములు కొనుగోలు చేశారు.
–ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు
–హెరిటేజ్‌ కంపెనీ సైతం 14 ఎకరాలు కొనుగోలు చేసింది.
–ల్యాండ్‌ పూలింగ్‌ అని చెప్పి వత్తిడి తెచ్చి రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారు.
–తన సన్నిహితుల భూములను మాత్రం పూలింగ్‌ ను మినహాయించారు.
–ఇక్కడ ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడ్డారు.
–ఇదంతా మామూలు స్కామ్‌ కాదు.సంచలనాత్మకమైన స్కామ్‌ 
–వ్యక్తిగతంగా నేను చంద్రబాబునాయుడుగారికి వ్యతిరేకంగా కాదు.
–రాష్ట్రానికి నేను కస్టోడియన్‌ ను.
–ఈరోజు నుంచి ఆరునెలలు ఏడాది లోపు దేశంలో మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.నిర్మాణాత్మక మార్పులు తెస్తాం.
–మొత్తం వ్యవస్దల్ని ప్రక్షాళన చేస్తాం.పారదర్శకత తెస్తాం.
–అవినీతి రహిత రాష్ట్రంగా తయారుచేస్తాం.
–చెప్పిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది.
–పోలవరం ప్రాజెక్ట్‌ ను యుధ్దప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఏపికి ఉంది.
–ప్రస్తుత టెండర్లు క్యాన్సిల్‌ చేసి రివర్స్‌ టెండరింగ్‌ చేసి గతంలో అవకతవకలు జరిగిఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఆలాగే చేస్తాం.
–టైం బవుండ్‌ గా పోలవరం ప్రాజెక్ట్‌ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
–మొదటి సంతకంతో ఆగిపోయే పరిస్దితి కాదు.
–నవరత్నాలను నెరవేరుస్తాం.అదే మా ప్ర«ధాన అంశం.డే వన్‌ నుంచి ఏం చేయబోతాం అన్నది ప్రమాణస్వీకారం నాడు తెలియచేస్తా.
–కేంద్రానికి 250 సీట్లు మాత్రమే రావాలని కోరుకున్నాం.కాని అలా జరగలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: