మోడీ అంటే రాగద్వేషాలకు అతీతుడని, ఆయనకు ఎమోషన్లే లేవని అతి భయంకరమైన ప్రచారాన్ని టీడీపీ వాళ్ళు చేశారు. అది ఎంతవరకూ  వెళ్ళిందంటే చంద్రబాబు సైతం మోడీకి ఫ్యామిలీ లేదు, ఆయనకు కుటుంబ విలువల అర్ధం తెలియదు అని హాట్ కామెంట్స్ చేశారు. ఇలా టీడీపీ పెద్దలు మోడీ గురించి అర్ధం పర్ధం లేని విమర్శలు చేసి చివరికి పరువు, పవర్ కూడా పోగొట్టుకున్నారు.


దానికి భిన్నగా ఈ రోజు ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఢిల్లీలో చోటుచెసుకుంది. మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన జగన్ని ఆయన అప్యాయంగా హత్తుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయన భుజంపై చేయితో తడుతూ గట్టి భరోసా ఇచ్చారు. ఇది చాలు ఏపీకి మోడీ న్యాయం చేస్తారని చెప్పడానికి. నిజానికి జగన్ విషయం తీసుకుంటే వయసులో చిన్నవాడు. పైగా మోడీకి రాజకీయంగా బాగా జూనియర్. ఇక పెద్దల పట్ల మర్యాదగా వ్యవహరిస్తారు.


ఏపీకి సంబంధించి చూసుకుంటాడు తప్ప తనకు సీనియారిటీ ఉందనో, లేదనో వూకదంపుడు కబుర్లు చెప్పడు. కనీసం ఇరవయ్యేళ్ళ పాటు ఏపీ సీఎం గానే జగన్ ఉండాలనుకుంటున్నాడు. జగన్ కి జాతీయ రాజకీయాల అవసరం కానీ, ఆ ధ్యాస‌ కానీ లేవంటే లేవు. బాబు అలా కాదు. మోడీ కంటే వయసులోనూ పెద్దవారు. అనుభవం విషయంలో మోడీ కూడా సమానమే అయినా సీనియారిటీ పేరు చెప్పి దెప్పిపొడవడం, ఇగో హర్ట్ అయ్యేల బిహేవ్ చేయడం వంటివి చేశారు. పైగా సందు దొరికితే ప్లేట్ ఫిరాయించే రకమని మోడీకి తెలుసు. జాతీయ రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టిన బాబుతో మోడీ రిలేషన్లు ఎపుడూ అపనమ్మకమంగానే సాగాయి.



అదే జగన్ అయితే మోడీకి కొడుకు లాంటి వాడు, ఇపుడిపుడే రాజకీయం దిద్దుకోవాలనుకుంటున్నాడు. అందువల్ల మోడీకి ఇబ్బంది లేదు. జగన్ కి కూడా అర్ధించడానికి  ఇగో అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్  ఏపీకి భరోసాగా ఉండడమే కాదు, మరిన్ని నిధులు తెస్తుందని, అభివ్రుధ్ధిని అందిస్తుందని  అంతా భావిస్తున్నారు  మోడీ జగన్ వీపు తట్టడం వెనక ఏపీకి మేలు చేసే ఉద్దేశ్యం ఉందని అంతా భావిస్తున్నారు. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: