ఏపీలో చంద్రబాబు జగన్ ల మధ్యన ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. జగన్ అసెంబ్లీకి వెళ్ళడం మానేశాక  రెండేళ్ళుగా ఇద్దరు నేతలూ ముఖాముఖాలు చూసుకోలేదు. ఇక జగన్ మీద హత్యాయత్నం జరిగితే బాబు కనీసం ఫోన్ లో నైనా పలకరించలేదు. ఇంతలా రాజకీయాలను మించి వైరాన్ని కొనసాగిస్తున్న  ఈ ఇద్దరు నేతల మధ్య సామరస్యం ఉంటుందని ఎవరూ అనుకోరు


సరే అదలా ఉంటే  తనకు చంద్రబాబు మీద ఎటువంటి కోపం లేదని వైఎస్ జగన్ సంచనల కామెంట్స్ చేశారు.  ఈ రోజు ఆయన ఆంధ్రాభవన్లో జరిగిన మీడియా మీట్లో మాట్లాడుతూ బాబు పాలనా పరమైన తప్పులనే తాను ఎత్తి చూపుతున్నాను తప్ప ఆయన మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం, ద్వేషం లేనేలేవని అన్నారు. తాను ఏపీ ఖజానాకు ధర్మకర్తనని ఆయన చెప్పుకున్నారు. రూపాయి ప్రజాధనం పోయినా తాను వూరుకోలేనని చెప్పుకొచ్చారు.


పోలవరం అవినీతి కానీ రాజధాని భూముల స్కాములు కానీ ఏదైనా తాను వెలికి తీస్తానని ఆయన కచ్చితంగా చెప్పారు. అవసరమైన  దర్యాప్తు చేయిస్తానని కూడా అన్నారు. ఈ విషయంలో తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చెప్పుకున్నారు. మొత్తానికి బాబు మీద కోపం లేదని చెప్పిన జగన్ ఆయన పాలనా కాలంలో జరిగిన అవినీతిపై మాత్రం దర్యాప్తునకు ఆదేశిస్తానని అంటున్నారు. అంటే టీడీపీకి తిప్పలు తప్పవన్న మాటేగా..


మరింత సమాచారం తెలుసుకోండి: