జగన్ పదేళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గ ఫలితం నాలుగు రోజుల క్రితమే లభించింది. ఎవరూ వూహించనంత పెద్ద మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. దేవుడి చల్లని చూపు, ప్రజల ఆశీర్వాద బలంతో అధికారంలోకి వచ్చామని  ఎక్కువగా  జగన్ చెబుతున్నారు కూడా. మరి జగన్ మాటను దేవుడు వినకపోవడమేంటి.


అదే విషయం ఢిల్లీలో జరిగిన మీడియా మీట్లో జగన్ చెప్పుకొచ్చారు. కేంద్రంలో మోడీ సర్కార్ కి 250 ఎంపీ సీలకు మించి రాకూడదని దేవున్ని పదే పదే ప్రార్ధించానని హాట్ కామెంట్స్ చేశారు. అలా కనుక జరిగి ఉంటే ఏపీలో తమ పార్టీ ఎంపీల మద్దతు అవసరం అయి ఉండేదని, కచ్చితంగా ప్రత్యేక హోదాపై సంతకం పెట్టిన వారికే మద్దతు ఇచ్చేవారమని జగన్ వివరించారు.


ఇపుడు ఆ అవకాశం లేదు, మోడీకి మంచి మెజారిటీ వచ్చినిది. అందువల్ల వారిని ప్రాధేయపడడం తప్ప మరేం చేయలేమని జగన్ అనడం విశేషం. ఓ విధంగా హోదా అంశంలో జగన్ ఆశా నిరాశల మధ్యన పడినట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. చూడాలి హోదా కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వస్తాను మోడీని కలుస్తాను అంటున్నారు. అంటే మోడీ ఇవ్వరన్నది జగన్ కి అపుడే అర్ధమైందా..


మరింత సమాచారం తెలుసుకోండి: