జగన్.. మూడు అక్షరాలు ఇపుడు యువతకు ఎంతో స్పూర్తి. ఎందుకంటే పోరాటం చేయాలి. గెలిచే వరకూ చేయాలి. గెలుపును వెతుక్కుంటూ ఎందాకైనా పోవాలి. అది అందేవరకూ విసుగూ విరామం లేకుండా యుధ్ధమే చేయాలి. అందుకు అన్నీ వదిలేసి సిధ్ధమైపోవాలి. ఇది పదేళ్ళ రాజకీయ  పోరాటయోధుడు జగన్ జీవితం చెప్పిన జీవిత సత్యం. యువతకు  ఇచ్చిన ఇన్స్పిరేషన్.


జగన్ తాజా ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించారు. ఇపుడు ఆయన తండ్రి వైఎస్సార్ తో పలువురు పోల్చి తండ్రిని మించిపోయాడని అంటున్నారు. ఇది నిజమే. ఎందుకంటే వైఎస్సార్ జగన్ లా సాహసాలు చేయలేదు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అండగా ఉండగా ఆయన దాన్ని గెలిపించేందుకు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన ఓటు బ్యాంకు ఉంది. దానికి వైఎస్సార్ ప్లస్ అయ్యారు. ఆ విధంగా ఆయన చక్కని ఓ ఫ్లాట్ ఫారం మీద రాజకీయం చేస్తూ పోయారు. ఆయనకు క్యాడర్ నుంచి నాయకుల అండదండలు బాగా ఉన్నాయి.


అదే జగన్ అయితే ఒంటరి. ఒక్కడే బయటకు వచ్చాడు కాంగ్రెస్ ని  వదిలేసి. ఆ తరువాత పదిమంది చేరారు అది వేరే విషయం. జగన్ పడ్డ కష్టాలు, ఇబ్బందులు పగవాడికి కూడా వద్దు అనిపించేలా సాగాయి. పదహారు నెలల జైలు జీవితం తీసుకున్నా, ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కలసిపోయి చీకటి దెబ్బలు ఎన్నో వేసినా కూడా జగన్ మొండిగా తట్టుకున్నాడు. తన అవకాశం కోశం ఎదురుచూశాడు. జనంలోనే ఉంటూ జనం అండతోనే అన్ని రాజకీయాలు కూకటి వేళ్ళతో పెకిలించాడు.


 ఇక్కడ ఓ ముచ్చట చెప్పుకోవాలి. వైఎస్సార్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనేకసార్లు అసంత్రుప్తి వెళ్ళగక్కారు.  ఆయనకు సీఎం సీటు ఇలా వచ్చి అలా పోతూంటే విసుగు వచ్చి 1994 టైంలో ఏకంగా ఓ ప్రాంతీయ పార్టీని ఏపీలో పెట్టాలనుకున్నారు. దాని పేరు రాజీవ్ కాంగ్రెస్ అని కూడా ప్రచారం జరిగింది. మరి ఏ కారణాల చేతనో ఆయన కాంగ్రెస్ ని వీడి బయటకు రాలేకపోయారు. చివరకు అదే పార్టీ నుంచి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అయితే అది కూడా కాంగ్రెస్ దయతలచి ఇచ్చింది కాదు.


 తన రెక్కల కష్టంతో జనంలో తిరిగి ఆ పార్టీని గెలిపించి అలా సీఎం అయ్యారు. ఇక జగన్ మాత్రం ఒక్కడుగా వచ్చి ఇంత పెద్ద విజయం సాధించారు. తెగింపులో, ధైర్యంలో తండ్రినే  మించిపోయాడు. ఇక అధ్బుత విజయాలు స్రుష్టించడంలోనూ వైఎస్సార్ ని దాటేశారు. ఇక పాలనలో నాన్న‌ ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్తున్న జగన్ అది కూడా నిరూపించుకుంటే ఆ తండ్రిని మించిన వారే అవుతారు. నిజంగా ఇది వైఎస్సార్ కి కూడా గర్వకారణమే అవుతుంది. ఏ తండ్రి అయినా తల ఎత్తుకుని చూడాలి కొడుకు విజయాలు అనుకుంటాడు. అది జగన్ విషయంలో వైఎస్సార్ కే సాధ్యపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: