గజ ఈతగాడు మురికిగుంటలో పడ్డాడనే సామెత చంద్రబాబునాయుడుకు కచ్చితంగా సరిపోతుంది. విభజించు పాలించు అన్న పద్దతినే చంద్రబాబు ఎప్పుడు నమ్ముకున్నారు. ఆ డబల్ గేమే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును నిండా ముంచిందని విశ్లేషణలు వినబడుతున్నాయ్.  అదే సమయంల్ జగన్ లోని క్లారిటి అనేక సామాజికవర్గాలను ఆకట్టుకుందట.

 

కుల సమీకరణలు, సామాజికవర్గాల్లో చిచ్చు పెట్టటం, చీలిక తేవటం ద్వారా లబ్దిపొందేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తుంటారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోగా దారుణంగా దెబ్బతీశాయి. దానికి చంద్రబాబు ఆడిన డబుల్ గేమే ప్రధాన కారణం.

 

తెలుగుదేశంపార్టీని మూడు దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉన్న బిసిలు దూరమయ్యారు. అదే సమయంలో కాపులు కూడా పెద్ద హ్యాండ్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బిసిలు టిడిపిని వదిలేసి గుండుగుత్తగా వైసిపికి మద్దతుగా నిలబడినట్లు చంద్రబాబు జాతి మీడియానే విశ్లేషించింది.

 

వైసిపికి మొదటి నుండి మద్దతుగా నిలబడిన ముస్లింలు, క్రిస్తియన్లు, రెడ్లు, ఎస్టీ, ఎస్సీలు మొన్నటి ఎన్నికల్లో కూడా తిరుగులేని మద్దతు ప్రకటించారు. పై సామాజికవర్గాలకు తోడు గుండుగుత్తగా బిసిలతో పాటు కాపుల నుండి కొంత మద్దతు పలికారు. అలాగే, వైశ్య, క్షత్రియ సామాజికవర్గాలకు తోడు కొన్ని చోట్ల బ్రాహ్మణులు కూడా మద్దతు పలికారు.

 

పోలింగ్ సరళిని చూస్తే చంద్రబాబుకు మిగిలింది కేవలం కమ్మ సామాజికవర్గంలోని మెజారిటి మద్దతు మాత్రమే అని అర్ధమవుతోంది. కాపు రిజర్వేషన్ల పై చంద్రబాబు డబల్ గేమే టిడిపి కొంప ముంచినట్లు తెలుస్తోంది. కేంద్రపరిధిలోని రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు తన చేతిలోకి తీసుకోవాలని అనుకోవటమే పెద్ద తప్పు. అదే సమయంలో రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పటం కూడా బిసిలను బాగా మెప్పించిందని సమాచారం. అంటే ఏ విషయంలో అయినా జగన్ స్పష్టంగా ఉంటే చంద్రబాబు మాత్రం డబల్ గేమ్ ప్లే చేశారు. దాంతోనే నిండా ముణిగినట్లు జాతి మీడియా విశ్లేషించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: