పోలీసు బాసు డిజిపిగా దామోదర్ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మొదట జరిగిన అతిపెద్ద మార్పు ఇదే. ఇప్పటి వరకూ పోలీసు బాసుగా ఉన్న ఆర్పి ఠాకూర్ రిలీవ్ అయిపోయారు. ఠాకూర్ డిజిపిగా ఉన్నంత కాలం చంద్రబాబునాయుడుకు కొమ్ము కాసిన విషయం తెలిసిందే.

 

పోలీసు డిజిపిగా కాకుండా చంద్రబాబు మద్దతుదారునిగా టిడిపి నేతగా వ్యవహరించారంటూ వైసిపి నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేసిన విషయం తెలీసిందే. విశాఖపట్నం విమాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఠాకూర్ వ్యవహరించిన తీరుపై అప్పట్లోరాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది.

 

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నుండి జగన్ అధికారంలోకి వస్తే ఠాకూరే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోతారనే ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్లే పోలింగ్ ముగిసిన తర్వాత చాలామందితో పాటు ఠాకూర్ కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. దానికి తగ్గట్లే తాజాగా జగన్ కొత్త డిజిపిగా 1986 బ్యాచ్ కు చెందిన సవాంగ్ ను నియమించారు.

 

సవాంగ్ మదనపల్లి అడిషినల్ ఎస్పీగా బాధ్యతలు మొదలుపెట్టారు. తర్వాత కరీంనగర్ ఎస్పీగా, చిత్తూరు ఎస్సీగా పనిచేశారు. వరంగల్ రేంజి డిఐజిగా కూడా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపిఎస్పి బెటాలియన్ కమాండెంట్ గా కూడా ఉన్నారు. ఏసిబి డిజిగా ఉన్నారు. ఎప్పుడో డిజిపిగా నియమితులవ్వాల్సిన సవాంగ్ ఇపుడయ్యారంతే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: