ఏపీలో ఏ పత్రిక ఏ ఛానల్ ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ మీద టీడీపీ అనుకూల మీద చేసిన దాడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయిపోయారు. త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. తనను వ్యతిరేకించే మీడియా విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్పాలి.ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. టీవీ5 మీడియా సంస్థలు తమను వ్యతిరేకిస్తుంటాయని.. వాటి మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని జగన్ స్పష్టం చేశారు.


అదే సమయంలో అదే పనిగా బురద జల్లాలని భావించే వారికి చెక్ పెట్టేందుకు జ్యూడీషియల్ కమిషన్ ద్వారా మీడియా తప్పుడు రాతల్ని అరికట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు."దేశంలోనే తొలిసారిగా పరిపాలన కోసం జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఈనాడు - ఆంధ్రజ్యోతి - టీవీ5 లాంటి మీడియా సంస్థలు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాయి. ఏది ఏమైనా ఇవి చంద్రబాబుతోనే ఉంటాయి. ఈ వ్యవస్థను మార్చబోతున్నాం.


సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయబోతున్నాం. మేం ఏం చేయాలనుకున్నా ముందుగా ఆ ప్రతిపాదనను కమిషన్ ముందు ఉంచుతాం. వాళ్లు చెప్పే సూచనలు పాటిస్తాం - పాలసీలో మార్పులు చేస్తాం. అలా జ్యూడీషియల్ కమిషన్ అనుమతితోనే ఏ పాలసీనైనా తీసుకొస్తాం. అలాంటి పాలసీలపై ఈ ఆంధ్రజ్యోతి - ఈనాడు - టీవీ5 లాంటి సంస్థలు ఏవైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అప్పుడు వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటాం" అని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: