ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  అసాధారణ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కేబినెట్ కూర్పు సవాల్ కానుంది. మంత్రి వర్గం లో సీనియర్ ఎమ్మెల్యే లతో పాటు కొత్తవారు కూడా స్థానాన్ని ఆశిస్తుండడం తో జగన్ మోహన్ రెడ్డి ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

మంత్రి వర్గం లో గతం లో వైఎస్ కేబినెట్ లో పని చేసిన ధర్మాన, ఆనం , బొత్స , పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి వంటి వారితో పాటు, మొదటి నుంచి జగన్ వెన్నంటి ఉన్న శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రోజా, అంబటి రాంబాబు  వంటి వారు సైతం కేబినెట్ లో స్థానాన్ని ఆశిస్తున్నారు.

కేబినెట్ లో జగన్  ఎవరికి స్థానం కల్పిస్తారన్నది అంతు చిక్కక పోయినప్పటికీ , సోషల్ మీడియా లో మాత్రం కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు వైరల్ అవుతున్నాయి. కేబినెట్ లో ఎవరికి జగన్ మోహన్ రెడ్డి ఏ శాఖ అప్పగించనున్నారన్నది కూడా పేర్కొంటూ, వైస్సార్ కాంగ్రెస్ అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పేర్లలో పలువురికి మంత్రి పదవి దక్కడం ఖాయమే అయినప్పటికీ , అందరికి దక్కే అవకాశాలు ఉండక పోవచ్చునని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మంత్రి వర్గం పై జగన్ , వైఎస్ మాదిరిగా తనదైన ముద్ర ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  మొదటి నుంచి తన వెన్నంటి ఉన్నవారికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి, వైఎస్ కేబినెట్ లోనూ పనిచేసిన సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు వారిలో కొంత మందికి అవకాశం కల్పించవచ్చునని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: