అవినీతికి అవకాశం ఇస్తున్న టెండర్లను రద్దు చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించటం నిజంగా సంచలనమే. గడచిన ఐదేళ్ళుగా అవినీతి ఆరోపణలు వినిపించిన ప్రాజెక్టుల్లో ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టులే ఉన్నాయన్న విషయం అందిరికీ తెలిసిందే. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగిరి, హంద్రీ నీవా లాంటి ప్రతీ ప్రాజెక్టూ టిడిపి నేతలకు కల్పతరువుల్లాగ తయారయ్యాయి.

 

వందల కోట్లలో పూర్తయిపోవాల్సిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలను వేల కోట్ల రూపాయలకు పెంచుకుంటు పోయారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ 16 వేల కోట్ల నుండి రూ 58 వేల కోట్లకు పెంచేశారంటేనే అవినీతి ఏ స్ధాయిలో జరిగిందో అందరికీ అర్ధమైపోతోంది.

 

ఏ ప్రాజెక్టు కాంట్రాక్టు చూసినా చంద్రబాబునాయుడు లేకపోతే చినబాబు కనుసన్నలోనే ఫైనల్ అయ్యాయి. అందుకే పోలవరం పనులను ఎటువంటి టెండర్ పిలవకుండానే నవయుగ కంపెనీకి దారాదత్తం చేసేశారు. అదేమంటే క్యాబినెట్ నిర్ణయించిందని,  టెండర్లు పిలిచి పనులు అప్పగించేంత పమయం  లేదు కాబట్టే క్యాబినెట్లో చర్చించి నవయుగకు బాధ్యతలు అప్పగించామని చంద్రబాబు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

 

ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి లేని ప్రాజెక్టే లేదన్నట్లుగా చేసేశారు చంద్రబాబు, లోకేష్, మట్టి, ఇసుక, నీళ్ళు, భూమి అన్నింటినీ ఆదాయ మార్గాలుగా మలుచుకుని అవినీతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు. దాంతోనే జనాలకు చంద్రబాబు పాలనంటే కసి, ఏహ్యభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే చంద్రబాబు మాడు పగలగొట్టారు జనాలు.

 

అవినీతి జరిగింది వాస్తవం. అందినకాడికి తమ్ముళ్ళ దోచేసుకున్నది నిజం. ఏదేళ్ళల్లో ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయిన అవినితిని నిర్మూలించటం జగన్ చెప్పినంత ఈజీ కాదు. పైగా అవినీతికి అవకాశం ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టెండర్లను రద్దు చేయటం అనుకున్నంత సులభం కాదు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలు వెంటనే కోర్టులకు ఎక్కుతాయి. దాంతో పనులు ఆగిపోతాయి. కాబట్టి జగన్ అలాంటి టెండర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: