ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్మోహన్ రెడ్డి పేరుతో అరుదైన రికార్డు నమోదైంది. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ వారసుల్లో ఎవరికీ దక్కని రికార్డు జగన్ పేరుతో నమోదైంది.  సిఎంల వారసుల్లో ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్న వారసులెవరూ ఇంత వరకూ దేశంలో ముఖ్యమంత్రులు కాలేదు. ఆ ఘనత ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యమైంది.

 

తెలుగురాష్ట్రాల్లో చెప్పుకున్న దేశవ్యాప్తంగా చూసినా ముఖ్యమంత్రుల వారసులు చాలామందే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీయార్, పివి నరసింహారావు వారసులు చాలామందే ఉన్నారు. కానీ వారి వారసుల్లో ఎవరూ ముఖ్యమంత్రులు కాలేకపోయారు. అధిష్ఠానం దయతో ఏదో ఒక పదవితో సరిపెట్టేసుకున్నారు.

 

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చూసినా అదే పరిస్ధితి. తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సిఎంలుగా చేసిన వాళ్ళ వారసులెవరూ వేరే పార్టీ పెట్టుకుని సిఎం కాలేదు. కర్నాటకలో జనతా దళ్ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సొంత పార్టీనే కాబట్టి కొడుకు కుమారస్వామి సిఎం అయ్యారంతే. ఒడిస్సాలో కూడా బీజూ జనతాదళ్ లో బీజూ పట్నాయక్  తర్వాత వారసత్వ హోదాలో నవీన్ పట్నాయక్ సిఎం అయ్యారంతే.

 

ఏ విధంగా చూసుకున్నా జగన్ సాధించిన రికార్డు అరుదైనదనే చెప్పాలి. వైఎస్ మరణం తర్వాత సొంతంగా పార్టీని పెట్టుకుని నానా అవస్తలు పడ్డారు. దాదాపు పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి జనాల్లోనే తిరిగి మొత్తానికి తన టార్గెట్ అయిన సిఎం పదవిని అఖండ మెజారిటీతో సాధించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: