దివ్య స్పంద‌న అలియస్ రమ్య...కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్. త‌న ప‌నితో పాటు వివాదాల ద్వారా సైతం ఆమె వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ని సోషల్ మీడియాలో పెంచే బాధ్యతను చేపట్టిన దివ్య స్పందన, పార్టీలో తన పాత్రను తగ్గిస్తున్నట్టు భావించి కొద్దికాలం క్రితం అలక బూనినట్టు ప్ర‌చారం జ‌రిగింది.. ఆమె బాధ్యతల పరిధిని చాలా వరకు తగ్గించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ వ్యవహారాలపై అలిగిన రమ్య తన సోషల్ మీడియా చీఫ్ పదవికి రాజీనామా చేసినట్టు పుకార్లు వినిపించాయి. ఆమె తన ట్విట్టర్ ప్రొఫైల్ లో సోషల్ మీడియా పదవిని తొలగించడమే దీనికి రుజువని కొంద‌రు పేర్కొన్నారు. మ‌ళ్లీ తాజాగా అదే ప‌ని చేశారు ఆమె.



బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రముఖ నటి, కాంగ్రెస్ ప్రతినిధి దివ్య స్పందన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె ఖాతాను తొలగించారు. శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఖాతాను తొలగించడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ విషయం గురించి కాంగ్రెస్‌ వర్గాలు కూడా స్పందించడానికి సుముఖత చూపలేదు. కాంగ్రెస్‌ నేతలు నెల రోజుల పాటు టీవీ డిబేట్లకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పందన ట్విటర్‌ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. 


కొద్దికాలం క్రితం సైతం ఇలాగే ఆమె వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మార్గరెట్ ఆల్వా కుమారుడు నిఖిల్ ఆల్వాకు తన బాధ్యతల్లో చాలా వరకు బదలాయించడంపై దివ్య స్పందన ఆగ్రహంగా ఉన్నట్టు ప్ర‌చారం జ‌రిగింది.రాహుల్ గాంధీ ట్విట్టర్ ను నిర్వహిస్తున్న నిఖిల్ కు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ లో కూడా కీలక బాధ్యతలు అప్పజెప్పడం తనకు పరిధులు విధించడమేనని రమ్య భావించార‌ట‌. అనంత‌రం ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: