2009 సెప్టెంబర్లో మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డిగారు హెలికాఫ్టర్ ప్రమాదంలోచనిపోయారు. రాజశేఖర్ రెడ్డి వారసుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికిఅప్పటినుండే కష్టాలు మొదలయ్యాయి. సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు అనుమతినిరాకరించటంతో జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.


తనపై ఎన్నో కేసులు పెట్టినా ఏరోజు జగన్మోహన్ రెడ్డిగారు కృంగిపోలేదు. పార్టీ పెట్టిన కొత్తలో జరిగినఉపఎన్నికల్లో 18 స్థానాలకు గాను 15 స్థానాలు సాధించి ఘన విజయం సాధించాడు.

2014 ఎన్నికల్లోనేగెలవాల్సి ఉన్నప్పటికీ బీజేపీ జనసేన పార్టీలు తెలుగు దేశం వైపు మొగ్గు చూపటంతో వైయస్సార్కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.


ప్రతిపక్షానికే పరిమితమైనా ఐదేళ్ళు ప్రజల సమస్యల తరపున పోరాడాడు జగన్. పాదయాత్ర ద్వారాప్రజల మనసులకు మరింత చేరువయ్యాడు. పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించనని రాజకీయాల్లోమార్పుకు కారణమయ్యాడు జగన్. ఆ కష్టానికి ఫలితం 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు వైసీపీసొంతమయ్యేలా చేసింది. ప్రజల కష్టాలు చాలా దగ్గర నుండి చూశాడు కనుక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు రోజుల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిగారు


మరింత సమాచారం తెలుసుకోండి: