అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైంది జనసేన. పోటీ చేసిన చోట్ల పవన్ ఓడినప్పటికీ కొన్నిప్రత్యేక విలువలతో మాత్రం జనసేన పార్టీని నడిపించాడు. పోటీ చేసిన చాలా చోట్ల జనసేనడిపాజిట్లు గల్లంతైనప్పటికీ ఓటమికి కృంగిపోకుండా జనసైనికుల్లో కార్యకర్తల్లో ఉత్సాహంనింపాల్సిన భాద్యత మాత్రం పవన్ కల్యాణ్ పై ఉంది.


మరో రెండు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్లో పంచాయితీ ఎలక్షన్లు మొదలు కాబోతున్నాయి. ఇప్పటినుండేఎన్నికల్లో అభ్యర్థులను నియమించి వారి గెలుపుకై దిశానిర్దేశం చేయాల్సిన భాద్యత,  సరైన ప్రణాళికఆచరణతో పార్టీని ముందుకెళ్ళాల్సిన భాద్యత జనసేనపై ఉంది


గతంలో జరిగిన తప్పుల్ని సరిచేసుకుని జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు ముందుకు సాగాలి.కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రం ఏదో ఒక రోజు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చివరినిమిషంలో అభ్యర్థులను ప్రకటించటం జనసేనకు నెగటివ్గా మారింది. గత ఎన్నికల్లో జరిగినతప్పుల్ని సమీక్షించుకుని పాతికేళ్ళ ప్రస్థానానికి అడుగులు వేయాల్సిన భాధ్యత పవన్ కల్యాణ్ పైఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: