చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అందరికి. లేకపోతే చంద్రబాబునాయుడు మాటకు ఎదరుతిరగటమేంటి ?  టిడిపిలో అధినేతల మాటకు ఎదురు మాట్లాడిన నేతలెవరైనా ఉన్నారా ? ఎదురుతిరిగాలన్న ఆలోచన కూడా నేతలకు రాదు మామూలుగా. అలాంటిది చంద్రబాబు ఆదేశాలనే కాకుండా పంచాయితిని కూడా  విజయవాడ ఎంపి కేశినేని తీసిపారేసినట్లు మాట్లాడారంటే అర్ధమేంటి ?

 

ఇపుడీ విషయమే తెలుగుదేశంపార్టీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వయసులో తనకన్నా చిన్నవాళ్ళైన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ కు లోక్ సభలో పదవులు అప్పగించి తనకు మాత్రం డిప్యుటి పదవిని కేటాయించటంతో కేశినేని అలిగారు. దానికి తోడు ఎప్పటి నుండో చంద్రబాబుపై మంటగా ఉంది. పార్టీలో తనను ఓడించాలని ప్రయత్నించిన వారికి, తన వ్యతిరేకులకు చంద్రబాబు పెద్ద పీట వేయటాన్ని కూడా నాని సహించలేకున్నారు.

 

నానితో మాట్లాడేందుకు గల్లా జయదేవ్ ను చంద్రబాబు పంపినా ఉపయోగం లేకపోయింది. అందుకనే స్వయంగా చంద్రబాబే పూనుకుని కేశినేనిని పిలిపించుకున్నారు. చంద్రబాబు, గల్లా, కేశినేని మధ్య బుధవారం సాయంత్రం చాలాసేపు పంచాయితీ జరిగింది. అయితే, చర్చల్లో ఏం జరిగిందో తెలీదు కానీ కేశినేని మాత్రం సమావేశం నుండి బయటకు వచ్చేశారు. దాంతో చంద్రబాబు మాటలను కూడా కేశినేని లెక్క చేయలేదని అనిపిస్తోంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపికి దారుణమైన పరాభవం ఎదురైంది. దాంతో పార్టీకి ఇక భవిష్యత్తు లేదన్న ఉద్దేశ్యంతో బిజెపి అగ్రనేతలతో నాని టచ్ లో ఉన్నాడనే ప్రచారం ఊపందుకుంది. నాని బిజెపిలో చేరుతాడనే ప్రచారం ఈనాటిది కాదు. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో బిజెపి తరపున నాగ్ పూర్ లో  గెలిచిన నితిన్ గడ్కరీని అదే పనిగా వెళ్ళి సన్మానించటంతో ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

ఏదేమైనా మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు బాగా వీకైపోయిన విషయం వాస్తవం. దానికితోడు వయసు కూడా అయిపోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాడనే నమ్మకం కూడా పార్టీ నేతల్లో లేదు. చంద్రబాబు, చినబాబు సామర్ధ్యాలపై నమ్మకం లేని నేతలు ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే కేశినేని కూడా బిజెపిలోకి వెళిపోతారనే ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: