చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు సిబిఐకి నో కన్సెంట్ అంటూ జారీ చేసిన జీవోను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయిపోయింది. అంటే సిబిఐ రాష్ట్రంలో యధేచ్చగా దాడులు చేయవచ్చు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేసుల విచారణ కూడా చేపట్టవచ్చు.

 

గడచిన ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో అవినీతి ఏ స్ధాయిలో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. నీరు, భూమి, మట్టి, ఇసుక అన్న తేడా లేకుండా ప్రతిది అవినీతిమయం చేసేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరగని ప్రాజెక్టే లేదంటే అతిశయోక్తి కాదు.

 

అలాగే కేంద్ర పధకాలైన నీరు-చెట్టు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి ప్రతి ప్రాజెక్టులోను భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. టిడిపిలో క్రిందస్ధాయి నేత నుండి పై స్ధాయి వరకూ ప్రతీ ఒక్కళ్ళు అడ్డదిడ్డంగా మేసేసినవారే. చంద్రబాబు హయాంలో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందంటే ప్రతీ అవినీతిలోను నారా లోకేషే ప్రధాన లబ్దిదారుడున్నంతగా ఆరోపణలు వినబడ్డాయి.

 

ఎందుకైనా మంచిదనే  ముందుజాగ్రత్తగా చంద్రబాబు రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో వైసిపి చేసిన ఆరోపణలపై కేంద్రం ఎక్కడ సిబిఐ విచారణకు ఆదేశిస్తుందో అన్న భయంతోనే  సిబిఐ ఎంట్రీని అడ్డుకున్న విషయం తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుండి సిబిఐ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తోంది.

 

అందరూ అనుకున్నట్లుగానే జగన్ ఈరోజు సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  కాబట్టి టిడిపి హయాంలో జరిగిన అనేక అవినీతి ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం సిబిఐతో విచారణకు రిక్వెస్ట్ పంపవచ్చు. వెంటనే సిబిఐ కూడా రంగంలోకి దిగేస్తుంది. నిజంగా జగన్ గనుక విచారణకు ఆదేశిస్తే దర్యాప్తు చేయటానకి సిబిఐకి చేతినిండా పనే పని.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: