చంద్రబాబు గారు cm అవగానే  తన ఇంటి పైనే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేయడానికి పెట్టిన ఖర్చు..4 కోట్ల రూపాయలు.తరువాత క్యాంపు ఆఫీస్  కోసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్  మరమ్మత్తులకోసం పెట్టిన ఖర్చు 9కోట్ల 50 లక్షలు..అక్కడ ఫర్నిచర్ కోసం ఖర్చుపెట్టినది 10 కోట్లరూపాయలు.


సెక్రటరియేట్ లో L బ్లాక్ మరమ్మత్తులకోసం చేసిన ఖర్చు14 కోట్ల 60 లక్షలు .ఆ  secretarite బిల్డింగ్ లో నే CM ఆఫీస్ కోసం పెట్టిన ఖర్చు 4 కోట్ల 90 లక్షలు .


ఇంత ప్రజాధనం తగలేసి ఇక్కడ చేసిందేమీ లేదు.ఓటు కు నోటు కేసు లో దొరికిపోగానే విజయవాడకు పారిపోయిన చంద్రబాబు అక్కడ పరిపాలన భవనాలకు  తగలేసిన ప్రజల సొమ్ము ..విజయవాడలో RMP గెస్ట్ హౌస్ ని క్యాంపు ఆఫీస్ గా మార్చడానికి పెట్టిన ఖర్చు 42 కోట్లు..


 తరువాత లింగమనేని గెస్ట్ హౌస్ కోసం  కొన్ని కోట్లు తగలేశారు..ఇవన్నీ కాకా హైదరాబాద్ లో పైసా ప్రయోజనం లేని బిల్డింగ్ ల మైంటైన్ కోసం అయ్యే ఖర్చు 20 నుండి 25 కోట్లు..
అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో  మెక్కిన వేల కోట్ల రూపాయలు.ఇంత  దుబారా చేసిన బాబు గారిని ఏనాడు ప్రశ్నించని నోళ్ళు ...


తాత్కాలికంగా ఇంకో 5 ఏళ్ళు వాడుకోవడానికి మాత్రమే హక్కున్న భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేయడం ద్వారా,ఏదో ఆంధ్ర ఆస్తుల్ని  కెసిఆర్ కి ఇచ్చేసినట్లు ఏడుపులు ఏడవడానికి వీళ్ళకు సిగ్గులేదా?ఇలా ఇచ్చేయడం వల్ల  ఆంధ్ర ప్రభుత్వం బకాయి పడ్డ ఆస్థి పన్ను,నీటి పన్ను,కరెంట్ ఛార్జ్ లు బకాయిలను తెలంగాణ ప్రభుత్వం రద్దు  చేసింది.


ఎచ్చులకు పోయి రాష్ట్ర ఖజానా మీద ఇంకో 5 ఏళ్ళు  భారం పడకుండా చేసిన  ఆంధ్ర ముఖ్యమంత్రిని  అభినందించాల్సినది పోయి ఏడవడం లోనే వీళ్ళ నిబద్దత ఏమిటో అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: