ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం రేపు కొలువుదీరనుంది. శనివారం ఉదయం 11.49 గంటలకు సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులతో 25 మంది రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. దేశంలోనే ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు కలిగిన ముఖ్యమంత్రి ఇప్పటి దాకా లేరు. 

మరోవైపు మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో సమూల మార్పులు ఉంటాయని జగన్‌ స్పష్టం చేశారు. ఈ పద్ధతి ద్వారా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగకుండా చూస్తా అని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇది రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారికి కంటగింపుగా చోటు దక్కని వారికి ఊరటగా ఉంటుంది. అయితే ఈ వ్యూహం మంచిది కాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 

కేవలం రెండున్నర ఏళ్ళ సమయం ఉందంటే మంత్రులు పూర్తిగా అక్రమార్జనలో పడే అవకాశం ఉంటుంది. అలాగే వారిలో అభద్రతా భావం కూడా ఎక్కువగా ఉండవచ్చు.  కాబట్టి ఇది మంచి పద్దతి కాకపోవచ్చు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు ఏకంగా 90% కేబినెట్ రెండున్నర ఏళ్ళ తరువాత మారిపోతుందని అంటున్నాయి. అదే జరిగితే ప్రజలలోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అయితే ఇదంతా రెండున్నర ఏళ్ళ సంగతి అప్పటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికీ తెలుసు?



మరింత సమాచారం తెలుసుకోండి: