ఏపీ కేబినెట్ లిస్ట్ ఫైనల్ అయింది..ఇవాళ ఏపీ మంత్రుల జాబితాను సీఎం జగన్ సిద్ధం చేశారు. రేపు మంత్రుల ప్రమాణ స్వీకారం నిమిత్తం ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుని గేట్‌వే హోటల్‌లో బస చేసిన గవర్నర్ నరసింహన్‌ను  సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 25మంది జాబితాను జగన్ గవర్నర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి అందజేసిన మంత్రివర్గ జాబితాను గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా పరిశీలించిన అనంతరం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి పంపిస్తారు. తర్వాత జీఏడీ అధికారులు మంత్రులుగా నియమితులైనవారికి అధికారికంగా సమాచారం అందజేస్తారు. ఇదిలా ఉంటే తన కేబినెట్‌లో సామాజికవర్గాల వారీగా  సీనియారిటీ, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్..
మంత్రుల జాబితా ఇదే...
 
 
1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి     - చిత్తూరు
2. బుగ్గన రాజేంద్రనాథ‌ రెడ్డి   - కర్నూలు
3. మేకపాటి గౌతం రెడ్డి        -  నెల్లూరు
4. బాలినేని శ్రీనివాస్ రెడ్డి     - ప్రకాశం
5.  దాడిశెట్టి రాజా               - తూర్పు గోదావరి  
6. అవంతి శ్రీనివాస్            - విశా‌ఖపట్టణం  
7. ఆశ్లనాని                        - పశ్చిమ గోదావరి  
8. కొడాలి నాని                  - కృష్ణా జిల్లా  
9. బొత్స సత్యనారాయణ    - విజయనగరం  
10. ధర్మాన కృష్ణ ప్రసాద్       - శ్రీకాకుళం
11. పిల్లి సుభాష్ చంద్రబోస్  - తూ.గో.  
12. కురసాల కన్నబాబు      - తూ.గో.
13. పుష్పశ్రీవాణి                 - విజయనగరం
14. పేర్నినాని                      - కృష్ణా జిల్లా  
15. బాలరాజు (ఎస్టీ )             - ప.గో.
16.  మదునూరిప్రసాదరాజు    -  ప.గో.
17. కోలగట్ల వీరభద్రస్వామి     - విజయనగరం
18. అంజాద్ భాషా                - కడప
19. పినిపె విశ్వరూప్            - తూ.గో.
20. ఆళ్ల రామకృష్ణారెడ్డి          - గుంటూరు
21. తావేటి వనిత                  - ప.గో.
22.  చెరుకువాడరంగనాథరాజు -  ప.గో.
23. వెల్లంపల్లి శ్రీనివాస్           - కృష్ణా జిల్లా  
24. మేకతోటి సుచరిత            - గుంటూరు
25. మోపిదేవి వెంకటరమణ    - గుంటూరు


స్పీకర్   - తమ్మినేని సీతారాం
డిప్యూటీ స్పీకర్ - కోన రఘుపతి..?


సామాజికవర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురికి, బీసీలు 7 గురికి, ఎస్సీలు 5 గురికి, వైశ్య సామాజికవర్గానికి ఒకరికి, కమ్మ సామాజికవర్గానికి ఒకరికి, ముస్లింలలో ఒకరికి, కాపులలో 4 గురికి, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఒకరికి మొత్తంగా 25 మందితో కేబినెట్‌ను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో 5 గురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 11.49 నిమిషాలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు నిరాశ మిగిలింది. ఈ రోజు కొద్ది సేపటి క్రితం వరకు కూడా రోజాకు హోంమినిస్టర్ పదవి దక్కుతుందని ఎల్లోమీడియాలో కూడా ప్రచారం అయింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రోజాకు సీఎం జగన్ మొండి చెయ్యి చూపించారు. ఈ రాత్రికి అధికారికంగా మంత్రుల జాబితా విడుదల అవుతుందని సమాచారం. మొత్తంగా జగన్ తన కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం..


మరింత సమాచారం తెలుసుకోండి: