రాష్ట్రంలోని  మెజారిటి సామాజికవర్గాలకు మంత్రివర్గంలో పెట్ట పీట వేయటం ద్వారా జగన్ శాస్వత అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. రాష్ట్రంలో మెజారిటి సామాజికవర్గాలైన బిసి, ఎస్సీ, కాపులను శాస్వతంగా వైసిపితోనే అట్టి పెట్టుకోవటానికి జగన్ బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు.  ముఖ్యంగా బిసిలకు పెద్ద పీట వేయటమే ఇందుకు నిదర్శనం.

 

గడచిన 36 ఏళ్ళుగా అంటే టిడిపి పెట్టినప్పటి నుండి బిసిలు తెలుగుదేశంపార్టీనే అంటిపెట్టుకున్నారు. టిడిపితో అంతటి అనుబంధం ఉన్న బిసిలు మొదటిసారి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని కాదని వైసిపికి గుండుగుత్తగా మద్దతు పలికారు. దాంతోనే వైసిపికి బ్రహ్మాండమైన మెజారిటి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో కూడా బిసిలు టిడిపిని వదిలిపెట్టింది లేదు. అంటే పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ అంతటి బలమైన పునాదులు వేశారు.

 

బిసిల్లో అంత గట్టిగా ఉన్న పునాదులను చంద్రబాబునాయుడు తన చేతకాని తనంవల్ల చెడగొట్టుకున్నారనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవటానికి బిసిల మద్దతు ఎంత అవసరమో జగన్ గుర్తించారు. అదే సమయంలో బిసిలను చంద్రబాబు చేతులార దూరం చేసుకున్నారు. సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన బిసి సంఘాల నేతలపై ఇష్టం వచ్చినట్ల నోరు పారేసుకోవటం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

ఇక ప్రస్తుతానికి వస్తే మంత్రివర్గంలో మిగిలిన సామాజికవర్గాలకన్నా బిసిలకే జగన్ పెద్ద పీట వేశారు. మొత్తం 25 మంది మంత్రుల్లో 7 మంది బిసిలకు అవకాశం ఇచ్చినట్లే కనబడుతోంది. సొంత సామాజికవర్గమైన రెడ్లలో 4 గురికే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అలాగే వైసిపికి  మొదటి నుండి మద్దతుగా నిలిచిన ఎస్సీల్లో 5 మందికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

 

ఇక కాపుల నుండి 4 గురిని తీసుకుని పెద్ద పీటే వేశారు. అలాగే ఎస్టీల్లో ఒకరికి అవకాశం ఇచ్చారు. మొత్తం మీద సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకునే మంత్రుల సంఖ్యకు జగన్ పెద్ద పీట వేసినట్లు అర్ధమైపోతోంది.  మొత్తం మీద జగన్ మంత్రివర్గం కూర్పు చూస్తే మాత్రం బిసిలు, కాపులు శాస్వతంగా వైసిపితోనే ఉండిపోయేట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: