ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇందులో శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనుకబాటుతనంతో నిండి ఉంది. అయినా ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ నుంచి రాష్ట్ర, దేశ రాజకీయాలను ఎందరో శాసించారు. ఇక్కడ గెలిచిన వారు ఎందరినో ఢీ కొట్టారు.


శ్రీకాకుళం జిల్లా ఇప్పటికి ముగ్గురు స్పీకర్లను అందించింది. టీడీపీ ఏర్పాటు  తరువాత ఈ జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణకు అన్నగారు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు ఇదే జిల్లాకు చెందిన ప్రతిభా భారతిని స్పీకర్ గా  నియమించారు.  ఇపుడు జగన్ తన ప్రభుత్వంలో  మాజీ మంత్రి తమ్మినెని సీతారామ్  అనుభవాన్ని, రాజకీయ పరిణతిని ద్రుష్టిలో ఉంచుకుని అతి కీలకమైన స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. 


తమ్మినేని సభను చక్కగా నడుపుతారనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును కట్టడి చేసేందుకు తమ్మినేని బాగా ఉపయోగపడతారు. తమ్మినేని పార్టీలో కీలకమైన నాయకునిగా పనిచేసినపుడు కూడా బాబు విధానాలను ఎండగట్టేవారు. ఒకపుడు తన మంత్రివర్గంలో పనిచేసి ధిక్కరించి వెళ్ళిన తమ్మినేనిని బాబు ఇపుడు అధ్యక్ష అని పిలిచే సీన్ ఇంటరెస్టింగ్  అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: