నోటా అంటే  ఉన్న అభ్యర్థులలో ఎవరు నచ్చకుంటే నోటాకు ఓటు వెయ్యచ్చు అని 2013 లో దీనిని అమలులోకి తెచ్చారు.నాయకులు సరైన వారు కాదని పోలింగ్ కి రావడం అపేస్తున్న జనాలను తిరిగి పోలింగ్ కి రప్పించడానికి దీనిని తీసుకువచ్చారు.దీని ద్వారా ఆ నియోజకవర్గస్థాయిలో పార్టీ లు పెట్టిన అభ్యర్థులు మీద జనం ఎంత అసంతృప్తిగా ఉన్నారో పార్టీ లకు తెల్పడానికి ఇది ఉపయోగపడుతుంది.

2019  లోకసభ ఎన్నికలలో  దేశవ్యాప్తంగా నోటాకు పోలైన ఓట్లు 1.06 శాతం. దేశంలోని వివధ ప్రాంతాలలోని పలు రాజకీయ పార్టీలకు నోటా కంటే తక్కువ శాతం ఓట్లుతో సీట్లను గెలుచుకున్నాయి. ఈ లిస్టులో దాదాపు 15 రాజకీయ పార్టీలు ఉన్నాయి.

0.52 శాతం ఓట్లతో లోక జనశక్తి పార్టీ  6 సీట్ లను,సీపీఎం 0.01 శాతం ఓట్లతో 3 సీట్లను ,0.05 శాతం ఓట్లతో ఎన్.సి 3 సీట్లను గెలచుకున్నాయి.అకాలీదళ్,ఎంఐఎం,సీపీఎం,అప్నాదళ్ వంటి కొన్ని పార్టీలకు 1 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వీరు తక్కువ శాతం ఓట్లతో సీట్ లు గెలిచామని ఆనందపడాలో లేక తమ ఉనికి పోతుంది అని బాధపడాలో తెలియని అయోమయంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: