మాట జారితే తిరిగి రాదంటారు. చంద్రబాబు జోరులో మాటజారారు, అది కాస్త రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు ఏంచేయాలో తెలియక పడుతున్న అంతర్మథనం అంతాఇంతా కాదట.           బిసిల డిక్లరేషన్ జోరుతో ఆయన ఎస్సీల విషయంలో నోరుజారారు. తెలంగాణ అంశం ప్రస్తుత రాజకీయాల్లో అందరికి ఎంత వివాదస్పదంగా మారిందో అంతే స్థాయిలో ఎస్సీల వర్గీకరణ షెడ్యూల్డ్ కులాల్లో అంతే రచ్చ సృష్టించింది. తనకు తానే రాజకీయశూరుడని భావించి అప్పట్లో తెలంగాణ విషయంలో అటూఇటూ కాకుండా రెండు కళ్ల సిద్దాంతం ఎంచుకున్నారు.అది కాస్తా రివర్స్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఎస్సీల విషయంలో అలాకాక ఏదో ఒకవైపే క్లియర్ గా వెలితేనే మంచిదని భావించారేమో అందుకే ఆయన ఎస్సీల వర్గీకరణకు సై అన్నారు.            ఇంకేముంది తేనే తుట్టను కదిలిస్తే తేనెటీగలు ఊరుకుంటాయా... ఇప్పుడు చంద్రబాబుకు అదే జరిగింది. ఎస్సీల్లో దీనిని వ్యతిరేకిస్తున్న వర్గం భగ్గుమంది. చంద్రబాబు పై ఫైర్ అయింది. అయితే సదరు వర్గాలు ప్రకటనలు,విమర్శలతో సరిపెట్టి ఊరుకుంటారని ఆయన భావించారు. కాని ఆనిర్ణయాన్ని వెకక్కు తీసుకుని మాలలకు క్షమాపనలు చెప్పేంత వరకు వదిలేది లేదని ఏకంగా టీడీపి కార్యాలయాల ముట్టడి వరకు వెల్లారు. ఇది ఇంతటితో ఆగేలా లేదు, ఇంకా ముదిరి చంద్రబాబుకు ఉచ్చులా తయారయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.            అదే జరిగేతే మాలల్లో మొత్తం టీడిపి పట్ల వ్యతిరేకత పుట్టే అవకాశాలున్నాయి.ఈదిశగా మాలల ఆందోలన మరింత ఉదృతమైతే పార్టీలోని ఆవర్గపు నేతలు కూడా రివర్స్ కావచ్చు. అంటే చిలికిచిలికి గాలి వానలా మారకుముందే చంద్రబాబా ఏదో ఒకటి చేయాలన్నమాట.            అయితే మాట జారితే తిరిగి వస్తుందా...అదే సాధ్యమయితే మన ఘనత వహించిన రాజకీయుల నోళ్లకు పగ్గాలుంటాయా...అంటే జారినమాటకు జారిపడాల్సిందే మరి. అందుకే ఇప్పుడు కిం..కర్తవ్యం అంటూ తలగోక్కుంటున్నారట చంద్రబాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: