ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగుతున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. 

అవ్వా,తాతల పింఛన్లను రూ.2250కి పెంపు, అక్టోబర్‌ నుంచి 12,500 రైతు భరోసా అమలు, ఆశా వర్కర్లకు రూ.10వేల జీతం పెంపు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. 

మున్సిపల్‌ ఉద్యోగుల వేతనాలు, హోంగార్డులకు దినసరి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అధికారం లోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌..
ఈ అంశంపైనా చర్చించి, ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి తో ఒక అధ్యయన కమిటీ వేయనున్నారని సమాచారం.

 దివంగత ముఖ్య మంత్రి, వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి డ్రీం స్కీమ్‌ ఆరోగ్యశ్రీ పథకంపై చర్చతో పాటు 104, 108 సర్వీసుల కోసం నూతన వాహనాల కొనుగోలుపైనా తగు నిర్ణయం తీసుకొనే అవకాశం ఈ క్యాబినెట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: