వైసీపీ అధినేత రాజకీయాల్లో వరసగా షాకింగ్  డెసిషన్స్ తీసుకుంటూనే ఉన్నారు. ఆయన అలా షాకుల మీద షాకులు ఇస్తూంటే విస్తుపోవడం ప్రత్యర్ధి పార్టీల వంతు అవుతోంది. ఏపీలో రెడ్ల పాలన వస్తోందని తెగ హడావుడి చేసిన అనుకూల మీడియ కళ్ళు తెరిపించేలా మంత్రి వర్గ కూర్పు చేసి గట్టి ఝలక్ ఇచ్చేశారు.


ఏపీలో ఇపుడు ఉన్నది బీసీల ప్రభుత్వంగానే  గట్టిగా చెప్పాలి. ఇక జగన్ పాలనాపరంగా కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో తొలి క్యాబినెట్ మీటింగ్ లో  దాదాపుగా యాభై అంశాలపై చర్చించి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం ఓ రికార్డ్.  వీటికి తోడు ఇపుడు మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇస్తారు. ఆ పదవికి కాంగ్రెస్, డీఎంకే తరువాత మూడవ అతి పెద్ద విపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి చాన్స్ వచ్చే అవకాశం ఉందట.


మరి జగన్ ఎవరిని ఆ ఉన్నతమైన సీట్లో కూర్చోబెడతారు అని ప్రశ్న వచ్చినపుడు అరకు నుంచి రాజకీయ దిగ్గజం వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని ఓడించిన 26 ఏళ్ళ అతి పిన్న వయస్కురాలు గొడ్డెటి మాధవిని ఆ పదవికి జగన్ ఎంపిక చేస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే గిరిజన ఆడబిడ్డకు జగన్ చేసిన అతి పెద్ద సామాజిక న్యాయం ఇదే అవుతుంది. మొత్తానికి జగన్ తనదైన పొలిటికల్ విజన్ తో దూసుకుపోతున్నరనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: