ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అధికార పక్షంలో జగన్ .. ప్రతి పక్షంలో చంద్రబాబు. చూడటానికి ఈ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన అహంకారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిపక్ష నేతని పురుగులానే చూశారు. 'దొంగ' అంటూ పదే పదే వైఎస్‌ జగన్‌ మీద టీడీపీ సభ్యులతో చంద్రబాబు చేయించిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? 


మరిప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏం జరుగుతుంది.? ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ని చంద్రబాబు ఫేస్‌ చేయగలరా.? ఛాన్సే లేదు. 'నేనూ అసెంబ్లీలోనే వుంటాను. అయినాగానీ, నేన మాట్లాడేదానికంటే మీరే ఎక్కువ మాట్లాడాలి. అధికార పక్షాన్ని నిలదీసే విషయంలో అస్సలేమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. కొంచెం అలసత్వం ప్రదర్శించామంటే తొక్కి పడేస్తారు..' అంటూ పార్టీకి చెందిన శాసనసభ్యులకు చంద్రబాబు గత కొద్ది రోజులుగా చేస్తున్న హితోపదేశం తాలూకు డోస్‌, ఇంకాస్త పెంచారట ఇప్పుడు. 


'కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం..' అంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయినట్లే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై విరుచుకుపడాలని చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించేశారట. కానీ, ఎంత గొంతు చించుకున్నా, అసెంబ్లీలో టీడీపీకి వున్నది చంద్రబాబుతో కలిసి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో, టీడీపీ వాయిస్‌ అసెంబ్లీలో గట్టిగా విన్పించడం అనే మాటకు పెద్దగా విలువ లేనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: