ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కుమార మంగళం బిర్లా కలిశారు. కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్లాంట్ ఏర్పాటు సీఎం జగన్ ఒప్పించారు. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద అల్ట్రాటెక్‌ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడితో భారీ ప్లాంట్ ను నెలకోల్పనున్న నేపథ్యంలో కంపెనీకి 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి ప్లాంట్ కొనుగోలు చేసింది.

కర్నూలులో ఏర్పాటైన ప్లాంటు కోసం 60 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్‌ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి.

ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెని, అధిత్య బిర్లా గ్రూపునకు చెందినది. సీఎం జగన్ కు, కుమర మంగళం బిర్లాకు ఉన్న పరిచయం వలన,ఈ భారీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. మోదటి దశలో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధిని సంస్థ కల్పించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: