కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత‌, ఎంపీ రేవంత్ రెడ్డి త‌న దూకుడును కొన‌సాగిస్తున్నారు. అనూహ్య రీతిలో ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి ఎప్ప‌ట్లాగే...అధికార టీఆర్ఎస్ పార్టీపై త‌న విమ‌ర్శ‌ల బాణం ఎక్కుపెడుతున్నారు. ఈ ప‌రంప‌ర‌లో తాజాగా కేసీఆర్ మ‌రో ప్ర‌త్య‌ర్థి, మీడియా సంస్థల అధినేత వివేక్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మధ్య దాదాపు అర‌గంట పాటు చ‌ర్చ జ‌రిగింది. ఈ ఇద్ద‌రు నేత‌ల స‌మావేశం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకేన‌ని అంటున్నారు. 

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి నుంచి బ‌రిలో దిగాల‌ని ఆశించిన మాజీ ఎంపీ వివేక్‌కు కేసీఆర్ టికెట్ నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో షాక్ తిన్న వివేక్ పార్టీకి, అప్ప‌టి వ‌ర‌కు త‌ను క‌లిగి ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు. అనంత‌రం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి నేత కోదండ‌రాంతో క‌లిసి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.మ‌రోవైపు ఆయ‌న నేతృత్వంలోని మీడియా సైతం గ‌తంలో ఉన్న త‌ట‌స్థ స్టాండ్‌ను ప‌క్క‌న‌పెట్టి...కేసీఆర్ స‌ర్కారుపై ఒకింత నెగెటివ్ క‌థ‌నాల‌నే ఇస్తోంది. ఇలా మీడియా దాడి స‌మ‌యంలో...రేవంత్ మాజీ ఎంపీ వివేక్‌తో భేటీ అయ్యారు. 

వివేక్‌కు చెందిన మీడియా సంస్థ‌లోనే రేవంత్ ఆయ‌న‌తో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో సాగుతున్న ప‌రిపాల‌న‌, వివిధ రాజ‌కీయ అంశాలు, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏడు పార్ల‌మెంటు సీట్ల‌లో టీఆర్ఎస్ ఓట‌మి పాల‌వ‌డం వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. టీఆర్ఎస్ ప‌ట్ల ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను మీడియా రూపంలో చెప్పాల‌ని రేవంత్ సూచించ‌గా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తామ‌ని వివేక్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా...ఈ ఇద్ద‌రు నేత‌ల భేటీ టార్గెట్ కేసీఆర్ అన్న‌ట్లు సాగిందంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: